వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రమ్యా కాంగ్రెస్ వదిలే ప్రసక్తే లేదు: క్లారిటీ ఇచ్చిన రంజిత, బీజేపీకి !

బహుబాష నటి, మండ్య లోక్ సభ నియోజక వర్గం మాజీ ఎంపీ రమ్యా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, ఆమెకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని రమ్యా తల్లి రంజిత తేల్చి చెప్పారు. రమ్యా తన సొంత పనుల్లో కొద్దిగా బీజీగా ఉన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బహుబాష నటి, మండ్య లోక్ సభ నియోజక వర్గం మాజీ ఎంపీ రమ్యా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, ఆమెకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. రమ్యా తన సొంత పనుల్లో కొద్దిగా బీజీగా ఉన్నారని స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ రమ్యా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రమ్యా రాజకీయ గురువు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపన ఎస్ఎం. కృష్ణ ప్రచారం చేశారు.

 Former Mandya MP, Actress Ramya going to join BJP ?

అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్యా మాత్రం నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో ఒక్క రోజు కూడా ప్రచారం చెయ్యలేదు. కనీసం అటు వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఈ సందర్బంలో రమ్యా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై రమ్య తల్లి రంజిత బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె (రమ్యా) కాంగ్రెస్ పార్టీ వీడరని, అదే పార్టీలో ఉంటారని, వేరే పార్టీలో చేరే అవకాశం లేదని కుండలబద్దలు కొట్టి చెప్పారు. అయితే ఈ విషయంపై స్వయంగా రమ్యా సమాధానం ఇస్తేనే ఓ క్లారిటీ వస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

English summary
Former Mandya MP, Actress Ramya going to join BJP ?. Why Ramya is silent on rumours of her joining BJP ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X