వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మిలిటెంట్ కాల్చివేత : ఉత్తర కాశ్మీర్‌లో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కాశ్మీర్ లో మళ్లి అల్లర్లు మొదలైనాయి. గుర్తు తెలియని ఉగ్రవాది మాజీ మిలిటెంట్ ను అతి దారుణంగా కాల్చి హత్య చెయ్యడంతో పలు చోట్ల గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుండి ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి.

ఉత్తర కాశ్మీర్ లోని సోప్రో పట్టణం సమీపంలోని ముంద్జీ గ్రామంలో అజయ్ అహమ్మద్ రేషి అనే మాజీ మిలిటెంట్ నివాసం ఉంటున్నాడు. ఇతను ఉగ్రవాదానికి స్వస్థి చెప్పి జనస్రవంతిలో కలిసిపోయాడు. మహమ్మద్ రేషి సోంతంగా వ్యాపారం చేస్తున్నాడు.

Former Militant Gunned Down by unidentified Men in North Kashmir's

సోమవారం ఉదయం మహమ్మద్ రేషి మీద గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో అతను సంఘటనా స్థలంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మహమ్మద్ రేషిని హత్య చేసిన వ్యక్తి అక్కడి నుండి పరారైనాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహమ్మద్ రేషి హత్యకు గురైనాడని వార్తలు వ్యాపించడంతో పలు చోట్ల అల్లర్లకు దిగారు. కొన్ని చోట్ల వాహనాల మీద రాళ్లురువ్వారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాట్లు చేశారు.

English summary
A former militant was on Monday gunned down by unidentified men in north Kashmir's Sopore town, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X