చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వద్దని చెప్పా, నేను చేసింది కరెక్టా.. తప్పా?: కప్పు టీ ధరతో షాకైన చిదంబరం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కప్పు కాఫీ, కప్పు టీ ధర చూసి కేంద్రమాజీ మంత్రి చిదంబరం షాకయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఆయన ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. విమానం రావడనికి ఇంకా సమయం ఉండటంతో వీఐపీ క్యాబిన్‌లో కూర్చున్నారు. టీ తీసుకు రావాలని తన గార్డుకు చెప్పారు. అతను టీ తెచ్చాక దానిని చూసి చిద్దూ షాకయ్యారు. అందులో పాలతో చేసిన టీ కాకుండా టీ బ్యాగ్ ముంచిన టీ ఉంది.

Former Minister P Chidambaram shocked to find Tea for Rs 135 At Chennai airport

చెన్నై విమానాశ్రయంలో టీ ఆర్డర్ చేశానని, చిన్న కప్పులో వేడి నీళ్లు పోసి ఓ టీ బ్యాగ్ వేసి ఇచ్చారని, దాని ధర రూ.135 అని, ఆ తర్వాత కాఫీ ఎంత అని అడిగితే రూ.180 అని చెప్పారని, ఇంత ధర ఉంటే ఎవరు కొంటారని అడిగానని, అతను చాలామంది కొంటారని తనకు చెప్పాడని, దీంతో షాకయ్యానని అన్నారు. దీంతో తాను టీ వద్దని చెప్పి వచ్చేశానని, నేను చేసింది తప్పా, కరెక్టా అని ట్వీట్ చేశారు.

English summary
Former Finance Minister and Congress leader P Chidambaram got a political debate brewing on Twitter over a cup of coffee at the Chennai airport that he found to be exorbitantly priced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X