వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్ సర్కార్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడింది. రైతుల రుణమాఫీ ఎప్పుడూ చేస్తారని ప్రశ్నించింది. ఇచ్చిన హామీలు విస్మరించిన కమల్‌నాథ్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని విమర్శించింది. రైతు సమస్యలపై రాష్ట్రంలోని శివ్‌పురి పిచ్చొరిలో మంగళవారం బీజేపీ నేతలు భారీ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ పాల్గొని .. ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టారు.

రైతుల కోసం ..

రైతుల కోసం ..

రైతు సమస్యలపై పిచ్చొరిలో బీజేపీ నిరసన చేపట్టింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ .. మధ్యప్రదేశ్ సర్కార్ తీరును ఎండగట్టారు. రైతు సమస్యలను తీర్చడంలో కమల్ నాథ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు రుణాలను ఎప్పుడూ మాపీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన చూస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన వివర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రస్తుత సీఎం కమల్ నాథ్ హామీనిచ్చారని శివరాజ్ గుర్తుచేశారు. అధికారం చేపట్టి ఇన్నాళ్లవుతున్న హామీ సంగతెందని ప్రశ్నించారు. ఇప్పటికే 8 నెలలు గడిచిన రైతు సంక్షేమ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

సీఎంను మార్చరు ..

సీఎంను మార్చరు ..

కాంగ్రెస్ పార్టీలో సీఎంలను మార్చే సాంప్రదాయం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే 24 మంది సీఎంలను మార్చారని .. మరి కమల్ సంగతేందని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినందుకు రాహుల్ పదవీకి రాజీనామా చేశారు. మరి మిగతా వారి సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోనియాగాంధీ అయినా .. మధ్యప్రదేశ్ రైతుల గోడు అలకించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తీర్చాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని బీరాలు పోయారు.

శివరాజ్ అరెస్ట్ ..

శివరాజ్ అరెస్ట్ ..

బీజేపీ ఆందోళనలో భారీ స్థాయిలో రైతులు, నేతలు పాల్గొన్నారు. కమల్ సర్కార్ వైఖరిని ఎండగట్టారు. అప్పటికే భారీగా జనం చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు శివరాజ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. శివరాజ్‌ను అదుపులోకి తీసుకోవడంతో .. అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మిగతా నేతలను కూడా అరెస్ట్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

English summary
former Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan was arrested in Shivpuri's Pichhore on Tuesday. He was participating in a farmers' agitation in the region. Taking aim at the Kamal Nath-led Congress government, he said that this government has failed on all accounts. He said, "The Kamal Nath government has not waived the loans of farmers. None of their promises has been fulfilled. We are not going to be scared of this government. When we weren't scared during the Emergency, why will we get scared now?" Shivraj Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X