వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ ముగిసి 17వ లోక్‌సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇద్దరికీ భారీ జరిమానా విధించింది. 2014లో ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరు అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు. అయితే బంగ్లాను ఖాళీ చేయకుండా అక్కడే ఉండటంతో జరిమానా విధించింది కేంద్ర ప్రభుత్వం.

పదవి లేనప్పటికీ ప్రభుత్వ బంగ్లాలో...

పదవి లేనప్పటికీ ప్రభుత్వ బంగ్లాలో...

మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్‌లు పదవిలో లేకున్నప్పటికీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాలో ఉండటాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డికి రూ. 3.87లక్షలు జరిమానా విధించగా మరో మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు రూ.2.44 లక్షల జరిమానా విధించింది. మొత్తంగా 9మంది మాజీ ఎంపీలు పదవి లేనప్పటికీ అధికారిక బంగ్లాల్లో ఉన్నందుకు రూ.25 లక్షలు జరిమానా విధించింది కేంద్రం.

 మాజీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

మాజీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

2014లో టీఆర్ఎస్‌ పార్టీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన జితేందర్ రెడ్డికి ఢిల్లీలోని బీఆర్ఎం లేన్‌లో బంగ్లా కేటాయించింది ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నారు. ఇక మురళీమోహన్‌కు 201 కావేరీలో బంగ్లా కేటాయించింది. జూన్ 25, 2019తో 16వ లోక్‌సభ ముగిసిన తర్వాత కూడా ఇద్దరు మాజీలు బంగ్లాను ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నారు. పదవీవిరమణ పొందిన బ్యూరోక్రాట్లు, పదవిలో లేని ఎంపీలకు సంబంధించిన ప్రభుత్వ బంగ్లాల నుంచి ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు గృహనిర్మాణ శాఖకు ఆదేశాలు జారీచేసింది. అందరినీ ఖాళీ చేయించడమే కాకుండా వారు చెల్లించాల్సిన డ్యూస్‌ను కూడా రికవర్ చేయాలని ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 దశాబ్దం క్రితం పదవీవిరమణ చేసిన బ్యూరోక్రాట్లు కూడా...

దశాబ్దం క్రితం పదవీవిరమణ చేసిన బ్యూరోక్రాట్లు కూడా...

పదవీకాలం ముగిసనప్పటికీ బంగ్లా ఖాళీ చేయకుండా ఉన్న వారిపై పిటిషన్ దాఖలు కాగా దీన్ని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ మరియు జస్టిస్ సీ హరిశంకర్‌లు విచారణ చేశారు. గడువు ముగిసినప్పటికీ మాజీ ఎంపీలు ఆ అధికారిక భవనాల్లో ఎలా ఉంటారంటూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు దశాబ్దం క్రితం పదవీవిరమణ పొందిన బ్యూరోక్రాట్లు కూడా అధికారిక భవనాల్లో ఇప్పటికీ ఉండటం వారి డ్యూస్‌ రూ.95 లక్షలు ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఖాళీ చేయించేందుకు పంచవర్ష ప్రణాళిక రూపొందించాలా...?

ఖాళీ చేయించేందుకు పంచవర్ష ప్రణాళిక రూపొందించాలా...?

మాజీలను ప్రభుత్వ బంగ్లాల నుంచి ఖాళీ చేయించేందుకు పంచవర్ష ప్రణాళిక ఏమైనా రూపొందించాలా అంటూ కోర్టు ప్రశ్నించింది. బకాయిలు రికవర్ చేసేలా ఏమైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించిన న్యాయస్థానం... ప్రజలు పన్నులు కడుతుంటే వీరికేమో ఉచితంగా బంగ్లాల్లో ఉండేందుకు అనుమతిస్తారా అంటూ ప్రభుత్వంపై కోర్టు మండిపడింది. అంతేకాదు ఇంకా ప్రభుత్వ బంగ్లాల్లో మాజీలు కొనసాగితే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హెచ్చరించింది.

ఇక మాజీ ఎంపీల బకాయిలు ఇలా ఉన్నాయి.
జితేందర్ రెడ్డి : రూ.3.87 లక్షలు
మురళీ మోహన్ : రూ. 2.44 లక్షలు
రంజీత్ రంజన్ : రూ.3.96 లక్షలు
ధనంజయ్ మహదిక్ : రూ. 1.90 లక్షలు
గోపాల్ : రూ. 1.31 లక్షలు
వీణాదేవి : రూ. 2.54 లక్షలు
తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ : రూ.1.51 లక్షలు
ఉదితి రాజ్: రూ.3.45 లక్షలు

English summary
Former TRS MP from Mahbub Nagar A. P Jitender Reddy has been slapped a bill of Rs 3.87 lakh for allegedly occupying government accommodation, even after the dissolution of the 16th Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X