వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎంపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన మాజీ ప్రధాని, చాలా ఇబ్బంది, ఢిల్లీలో పంచాయితీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పంచాయితీ ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ చీ్ హెచ్,డి. దేవేగౌడ ఆరోపించారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులతో భేటీ అయ్యారు. ఇదే సందర్బంలో రాహుల్ గాంధీతో చాల సేపు మాట్లాడిన మాజీ ప్రధాని దేవేగౌడ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏదో ఒక విషయంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారని సమాచారం.

Former PM and JDS supremo HD Deve Gowda met Congress president Rahul Gandhi in New Delhi.

మంత్రి వర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్న నిర్ణయంపై సిద్దరామయ్యతో సహ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతున్నారని, వారికి అడ్డుకట్ట వెయ్యకపోతే సంకీర్ణ ప్రభుత్వం మీద ఆ ప్రభావం అడే అవకాశం ఉందని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

లోక్ సభ ఎన్నిల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఓడిపోవడానికి కొందరు నాయకులే ప్రధాన కారణం అని, అలాంటి వారి మీద మీరు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని దేవేగౌడ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారని సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరే కారణం అని కన్నడ మీడియా వార్తలు ప్రచురించిన విషయాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది.

ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రి వర్గ విస్తరణ చెయ్యాలని తీసుకున్న నిర్ణయంపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యలు ఏమిలో సంకీర్ణ ప్రభుత్వానికి చెప్పాలని మాజీ ప్రధాని దేవేగౌడ రాహుల్ గాంధీకి మనవి చేశారని సమాచారం.

మంత్రి వర్గ విస్తరణ విషయంలో, మాజీ సీఎం సిద్దరామయ్య విషయంలోనే మాజీ ప్రధాని దేవేగౌడ, రాహుల్ గాంధీ చర్చలు జరిపారని సమాచారం. మాజీ మం్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా బహిరంగంగా మంత్రి వర్గ విస్తరణ విషయంలో సొంత పార్టీ నాయకుల తీరు మీద ఆరోపణలు చేశారని ఇదే విషయంలో మాజీ ప్రధాని దేవేగౌడ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారని తెలిసింది.

English summary
JDS supremo HD Deve Gowda met Congress president Rahul Gandhi in New Delhi. Some sources said he has complained about former CM Siddaramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X