బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఒక్క షరతు, లేదంటే లేదు: మాజీ ప్రధాని కాంగ్రెస్ కు షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని, రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మనసు మార్చుకున్నారు. తాను లోక్ సభ ఎన్నికల నుంచి ఈ సారి పోటీ చేస్తానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఒక షరతు విదించారు.

రేపే ప‌వ‌న్ యుద్ద శంఖారావం : హెలికాఫ్ట‌ర్ తో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు : అభ్య‌ర్దుల జాబితా సిద్దం..! రేపే ప‌వ‌న్ యుద్ద శంఖారావం : హెలికాఫ్ట‌ర్ తో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు : అభ్య‌ర్దుల జాబితా సిద్దం..!

 మై��ూరు, తుమకూరు

మై��ూరు, తుమకూరు

2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యాలంటే మైసూరు- కొడుగు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వదిలి పెట్టాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కాంగ్రెస్ హై కమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తుమకూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వదిలి పెట్టాలని మాజీ ప్రధాని దేవేగౌడ అంటున్నారు.

తుది నిర్ణయం

తుది నిర్ణయం

2019 లోక్ సభ ఎన్నికల సీట్ల పంపిణి విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే మైసూరు లేదా తమకూరులో ఏదో ఒక లోక్ సభ నియోజక వర్గం తమకు కేటాయించాలని జేడీఎస్ డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం లేదు.

మాజీ ప్రధాని పట్టు

మాజీ ప్రధాని పట్టు

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి దేవేగౌడ పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయ్యింది. అయితే మైసూరు లేదా తుమకూరు లోక్ సభ నియోజక వర్గాలలో ఎదో ఒకటి జేడీఎస్ కు కేటాయించాలని మాజీ ���్రధాని మెలిక పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు.

సిద్దూ, డీసీఎం అసహనం

సిద్దూ, డీసీఎం అసహనం

మైసూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వదిలిపెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు. తుమకూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వదిలి పెట్టడానికి ఉప ముఖ్యమంత్రి డాక్టర జీ. పరమేశ్వర్ అంగీకరించడం లేదు.

పోటీ చెయ్యకుంటే నష్టం

పోటీ చెయ్యకుంటే నష్టం

మాజీ ప్ర���ాని దేవేగౌడ పోటీ చెయ్యకుంటే జేడీఎస్ కు ఒక్క సీటు నష్టం వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో సిట్టంగ్ ఎంపీగా ఉన్న సదానందగౌడను ఓడించాలంటే మాజీ ప్రధాని దేవేగౌడ సరైన వ్యక్తి అని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మండ్య, హాసన్, బెంగళూరు ఉత్తర, శివమొగ్గ, విజయపుర, ఉత్తర కన్నడ, పాత మైసూరు లోక్ సభ నియోజక వర్గాలు కావాలంటున్న జేడీఎస్ పాత మైసూరు భాగంలో మరో సీటు కావాలని డిమాండ్ చేస్తున్నది.

English summary
Deve Gowda put condition to congress, if he need to contest for elections then congress should leave Mysuru or Tumakuru constituency to JDS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X