• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన ఖర్చు రూ.6,76,74,33,477

By Srinivas
|

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ ప్రయాణం పైన విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రయాణ ఖర్చులు రూ.6,76,74,33,477 (రూ. 676.7 కోట్లు, $107 మిలియన్లు)గా ఉన్నాయి. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ 73 సార్లు విదేశాల్లో పర్యటించారు.

మన్మోహన్ పర్యటనలు, ఖర్చు వివరాలు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చాయి. రమేష్ చంద్ జోషి అనే ఆర్టీఐ కింద ఈ సమాచారం కోరారు. అతను రాష్ట్ర రక్షక్ జన్‌మంచ్ అధ్యక్షులు.

అందులో పలు విషయాలు వెల్లడయ్యాయి. మన్మోహన్ సింగ్ రెండో పర్యాయం ప్రధానిగా ఉన్న సమయంలో... మొత్తం 36సార్లు విదేశాల్లో పర్యటించారు. అందులో 15సార్లు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉన్నాయి.

 మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

22 మే 2004 నుండి 17 మే 2014 వరకు మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో 73సార్లు విదేశాల్లో పర్యటించారు. ఇందుకు సంబంధించి వివరాలను షీట్లలో ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ఎక్కువసార్లు అమెరికాలో పర్యటించారు.

 మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

ఆసక్తికరమైన విషయమేమంటే భారత్ చుట్టుపక్కల దేశాల కంటే ఇతర దేశాలకే మన్మోహన్ ఎక్కువగా వెళ్లారు. మన్మోహన్ అతి ఎక్కువ ఖర్చైన విదేశీయానం 2012లో మెక్సికో, బ్రెజిల్.

 మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

అప్పుడు వారం రోజుల విదేశీ పర్యటనలో రూ.26.94 కోట్లు అయ్యాయి. రెండో అత్యధిక ఖర్చైన ప్రయాణం 2010లో అమెరికా, బ్రెజిల్. ఆ సమయంలో 22.7 కోట్లు అయ్యాయి.

 అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1999 నుండి 2004 వరకు 35సార్లు విదేశాల్లో పర్యటించారు. అందుకు రూ.185 కోట్లు ఖర్చయ్యాయి.

English summary
Rs 6,76,74,33,477 (Rs 676.7 crore, $107 million) was the cost what the nation incurred during the 73 foreign trips that Dr Manmohan Singh made as Prime Minister. The figure which was provided by the Prime Minister's Officer following an RTI query filed by Ramesh Chand Joshi, president of the Rashtra Rakshak Janmanch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X