వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక నుంచి మిమ్మల్ని రక్షిస్తా, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం: హీరో కమల్ హాసన్ ఫైర్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kamal Hassan Party Launch Update

చెన్నై: బహుబాష నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. కమల్‌ హాసన్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకుని కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకు ముందు హీరో కమల్ హాసన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సమాధిని దర్శించుకుని నివాళులు అర్నించారు. అనంతరం మత్య్సకారులతో భేటీ అయిన కమల్ హాసన్ శ్రీలంక అధికారుల నుంచి మిమ్మల్ని రక్షిస్తామని, చేతకాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని అన్నారు.

నా జీవితం ధన్యం

నా జీవితం ధన్యం

సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని, అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నా జీవితం ధన్యం అయ్యిందని హీరో కమల్‌ హాసన్ ట్వీట్ చేశారు.

కమల్ కోసం ప్రార్థనలు

కమల్ కోసం ప్రార్థనలు

అబ్దుల్ కలామ్ సోదరుడు మహమ్మద్ ముతుమీర్ లెబ్బాయ్, ఆయన కుటుంబ సభ్యులు కమల్ హాసన్ కొత్త పార్టీ విజయం సాధించి పేదలకు మంచి చెయ్యాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అబ్దుల్ కలామ్ ఆశీర్వాధం కమల్ హాసన్ కు ఎప్పుడూ ఉంటుందని మహమ్మద్ ముతుమీర్ లెబ్బాయ్ మీడియాకు చెప్పారు.

ప్రభుత్వంపై విమర్శలు

ప్రభుత్వంపై విమర్శలు

అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి బయలుదేరిన హీరో కమల్ హాసన్ అనంతరం రామేశ్వరంలోనే మత్స్యకారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంలో తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం మీద కమల్ హాసన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దద్దమ్మ ప్రభుత్వం

దద్దమ్మ ప్రభుత్వం

మత్య్సకారుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని కమల్ హాసన్ విమర్శించారు. మత్స్సకారులకు ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదని తమిళనాడు ప్రభుత్వాన్ని కమల్ హాసన్న నిలదీశారు.

మంచి రోజులు వస్తాయి

మంచి రోజులు వస్తాయి

మత్య్సకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న హీరో కమల్ హాసన్ త్వరలో మీకు మంచి రోజులు వస్తాయని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హీరో కమల్ హాసన్ మత్య్సకారులకు హామీ ఇచ్చారు.

ఓఖీ తుపాను బాధితులు

ఓఖీ తుపాను బాధితులు

ఓఖీ తుపాను బాధితులను ఆదుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కమల్ హాసన్ విమర్శించారు. ఓఖీ తుపానుతో అదృశ్యం అయిన మత్స్యకారుల వివరాలు సేకరించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని, కనీసం వారి కుటుంబ సభ్యులను ఆదుకోలేదని కమల్ హాసన్ మండిపడ్డారు.

శ్రీలంక నుంచి రక్షిస్తాం

శ్రీలంక నుంచి రక్షిస్తాం

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రధాన్యత మత్స్యకారులకు ఇస్తామని, పొరుగు దేశం (శ్రీలంక) అధికారుల వేధింపుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హీరో కమల్ హాసన్ హామీ ఇచ్చారు. ఇలాంటి చేతకాని ప్రభుత్వానికి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉండాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

English summary
Former President Abdul Kalam's family members have prayed for Kamal's success in politics. Kamal haasan has twittted that he found the simplicity of his family at Kalam's home. Also said that i am thinking that its great fortune that I started my journey in the place where Abdul Kalam started.Actor turns Politicians Kamal Hassan interacts with fishermen community in Rameswaram.I will be there, will support the community. There is a need to re-discuss international treaties. Your questions cannot be answered with violence says Kamal Haasan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X