వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి గుడ్‌బై:పార్టీలోనే.. ఖండించిన కలాం మనవడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం న్యూఢిల్లీలో నివసించిన బంగ్లాను స్మారక భవనంగా ప్రకటించాలని ఎన్ని సార్లు కేంద్రానికి మనవి చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురైనారు.

కలాం సోదరుడి మనువడు ఏపీజే హజ సయిద్ ఇబ్రహీం సోమవారం బీజేపీకి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు. భారతదేశానికి ఎనలేని సేవలు అంధించిన అబ్దుల్ కలాం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ లో ఉన్నారు. పదవీ విరమణ అనంతరం అబ్దుల్ కలాం ఢిల్లీలోని రాజాజీ మార్గ్ లోని నెంబర్ 10 బంగ్లాలో ఉన్నారు. కలాం మరణించే వరకు ఆయనతో పాటు ఏపీజే హజ సయిద్ ఇబ్రహీం అదే బంగ్లాలో ఉన్నారు.

Former president APJ Abdul Kalam's grand nephew APJ Sheikh Salim.

కలాం మరణించిన తరువాత గత సెప్టెంబర్ నెలలో హజ సయిద్ ఇబ్రహీం బీజేపీలో చేరారు. అయితే కలాం నివాసం ఉంటున్న ఆ బంగ్లాను స్మారక చిహ్నంగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.

అయితే కేంద్ర మంత్రి మహేష్ శర్మకు ఆ బంగ్లాను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హజ సయిద్ ఇబ్రహీం బీజేపీకి టాటా చెప్పారు. రామేశ్వరంలో హజ సయిద్ ఇబ్రహీం సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.

ఖండించిన కలాం మనవడు

తాను బిజెపిని వీడానన్న వార్తల పైన మనవడు షేక్ సలీం స్పందించారు. తాను బిజెపిని వీడలేదని చెప్పారు. తాను బిజెపికి నమ్మకమైన కార్యకర్తనని వివరణ ఇచ్చారు. ఆయన వన్ ఇండియాతో మాట్లాడుతూ... మీడియాలో వచ్చిన వార్తలపై నేను ఆశ్చర్యానికి లోనయ్యానని చెప్పారు. ఎవరో రాసిన వాటి గురించి నేను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.

English summary
Syed Ibrahim was reportedly upset with the BJP-led Central government for not making Kalam's Delhi bungalow as memorial and allotting it to an Union minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X