వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా కోమాలోనే మాజీ రాష్ట్రపతి ... ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్

|
Google Oneindia TeluguNews

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి గతం కంటే కాస్త మెరుగైందని అంటున్నారు వైద్యులు . ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు . ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావటంతో సర్జరీ నిర్వహించారు. అప్పటి నుండి ఆయన కోమాలోనే ఉన్నారు. అయితే అప్పటికే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనను అత్యవసర వైద్య సేవల విభాగంలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు .

దైవదూత నిర్మలా .. కరోనాకు ముందు ఆర్ధిక వ్యవస్థ మాటేంటి ..'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్దైవదూత నిర్మలా .. కరోనాకు ముందు ఆర్ధిక వ్యవస్థ మాటేంటి ..'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోమాలో ఉన్న ఆయనకు అంతకుముందు మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తూ వస్తున్నారు .ప్రస్తుతం ఆయన మూత్రపిండాల పనితీరులో మెరుగుదల కనిపించిందని వైద్యులు చెప్తున్నారు . ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చిందని , అందుకు ప్రస్తుతం వైద్యం చేస్తున్నామని చెప్పారు.ఆయన ఇంకా డీప్ కోమాలో మరియు వెంటిలేటర్ మద్దతుతో కొనసాగుతున్నారని , ఆయన హేమోడైనమిక్‌గా స్థిరంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు .

Former President Pranab Mukherjee is still in a coma suffers with lung infection

ఆయన రక్త ప్రసరణకు సంబంధించి రక్తపోటు, గుండె మరియు పల్స్ రేటు స్థిరంగా ఉన్నాయని చెప్తున్నారు .ఆగస్టు 10 న బ్రెయిన్ శస్త్రచికిత్స తర్వాత ప్రణబ్ ముఖర్జీ తీవ్ర కోమాలో ఉన్నారు. ఆగస్టు 10 న ఆర్మీ ఆసుపత్రిలో చేరారు, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి చికిత్స చేస్తున్న వైద్యుల ప్రకారం, ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు . ఆయనకు బ్రెయిన్ సర్జరీ తో పాటు కరోనా వైరస్ సోకటం వల్ల అది ఆయన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో ఆయన అభిమానులకు చెప్తున్నారు .

English summary
Former President of India Pranab Mukherjee has shown improvement in the renal parameters following dysfunction earlier. The veteran politician is also being treated for his lung infection.In an update on Saturday, the Army Research and Referral Hospital said, “Hon’ble Shri Pranab Mukherjee is being treated for lung infection. His renal parameters have improved. He continues to be in deep coma and on ventilator support. He remains haemodynamically stable.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X