వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి(93) కన్నుమూత, సందర్శన అనంతరం అంత్యక్రియలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రజల సందర్శన అనంతరం అంత్యక్రియలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి(93) గురువారం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజపేయి జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేరారు. వాజపేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది.

శుక్రవారం అంత్యక్రియలు

గురువారం సాయంత్రం వాజపేయి పార్థీవ దేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఉదయం 9గంటలకు బీజేపీకి కార్యాలయానికి వాజపేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సందర్శకులకు అనుమతిస్తారు.

శుక్రవారం మ. 1.30గంటలకు అంతిమయాత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4గంటలకు రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్థల్‌లో వాజపేయి పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Former Prime Minister Atal Bihari Vajpayee Dies At 93

కాగా, వాజపేయి ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించడంతో బీజేపీ తన గురువారం నాటి అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్‌లో వాజపేయిని పరామర్శించారు.

గురువారం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతోపాటు బీజేపీ ముఖ్య నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా వాజపేయిన ఎయిమ్స్‌లో పరామర్శించారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా వాజపేయిని పరామర్శించారు. మంగళవారం ఉదయం వాజపేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించారు.

English summary
Former Prime Minister Atal Bihari Vajpayee Dies At 93.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X