వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ బాటలో మాజీ ప్రధాని నేపాల్ పర్యటన, ప్రభుత్వం, సీఎం, ఆలయం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నిరంతరం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనేక ఆలయాలు సందర్శించి పూజలు, హోమాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నేపాల్ కు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుటుంబ సభ్యులతో కలిసి వెలుతున్నారు.

నేపాల్ లోని శ్రీ పశుపతినాథ స్వామి ఆలయంలో శుక్రవారం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల, హోమాలు చెయ్యనున్నారు. దైవభక్తి ఎక్కువగా ఉన్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మూడు రోజుల క్రితం బెంగళూరులోని పద్మనాభనగర్ లోని ఆయన ఇంటిలో శ్రీ కాశీ విశ్వనాథస్వామి భారీ చిత్రపఠాన్ని ఏర్పాటు చేశారు.

Former Prime Minister H.D. Devegowda will visit to Nepal

కుమారుడు హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన తరువాత తిరుమల చేరుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల కేథారనాథ ఆలయాన్ని హెచ్.డి. దేవేగౌడ సందర్శించడానికి సిద్దం అయ్యారు.

భారీ వర్షాల కారణంగా కేథారనాథ పర్యటనను మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ వాయిదా వేసుకున్నారు. ఇంటి ఇలవేల్పు శృంగేరి శారదాంబ ఆలయంలో, కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కొన్ని సమస్యలతో సతమతం అవుతోంది. తన కుమారుడు హెచ్.డి. కుమారస్వామి పదవికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన జోతిష్యుడు శ్రీ పశుపతినాథ స్వామి దర్శనం చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ప్రధాని హెచ్.డి. కుమారస్వామికి సూచించారని సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం నేపాల్ చేరుకుని కైలాష్ మానససరోవర యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే.

English summary
Former PM H.D. Devegowda will visit to Nepal. He will take darshanam of lord Sri Pashupatinath temple on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X