వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...రాజస్థాన్‌ నుండి ఎన్నిక

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు....రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్ ఉపసంహరణకు గడువు సోమవారం ముగియడంతో మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అయితే గతంలో అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన మన్మోహన్ సింగ్ ప్రస్థుతానికి మాత్రం రాజస్థాన్‌ రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు. కాగా గత మంగళవారం రాజ్యసభకు ఆయన నామినేషన్ ధాఖలు చేశారు.

చాల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటీ పోటీ లేకుండా రాజ్యసభ స్థానాన్ని గెలుచుకుంది. మరోవైపు రాజస్థాన్ సభలో 73 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు.... ఇక డిసెంబర్‌లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎమ్మెల్యేల బలంతో పాటు, 12 మంది ఇండిపెండెండ్లు, ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నిక కావడం సునాయాసమే అయింది. కగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్ సైనీ గత ఏడాది జూన్‌లో మరణించడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో గెలిచిన మన్మోహన్ సింగ్ 2024 ఏప్రిల్ 3వ తేదీ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు.

Former prime minister Manmohan Singh elected to the Rajya Sabha from Rajasthan

కాగా తన ఎన్నికకు సహకిరించిన రాజస్థాన్ పార్టీ నేతలకు మన్మోహన్ సింగ్ కృతజ్ఝతలు తెలిపారు. మరోవైపు ఆయన ఎన్నికపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

English summary
Former prime minister Manmohan Singh Monday was elected unopposed to the Rajya Sabha from Rajasthan. He was declared elected unopposed as the deadline for the withdrawal of nominations for the bypoll ended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X