రైతులకు ద్రోహం చెయ్యటాన్ని నిరసిస్తూ .. పద్మ విభూషణ్ను తిరిగిచ్చేసిన పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ఎన్డీయే యొక్క బలమైన మిత్రులలో ఒకరైన శిరోమణి అకాలీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ రైతుల పోరాటానికి మద్దతుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తనకు భారత్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు . కొనసాగుతున్న రైతుల ఆందోళనల మధ్య వ్యవసాయ చట్టాలకు నిరసనగా తన పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేసిన ప్రకాష్ సింగ్ బాదల్
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకుడు, ఐదుసార్లు మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ గురువారం పద్మ విభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసినందుకు , ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం విషయంలో వ్యవహరిస్తున్న ఉదాసీనతకు , రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారు . ప్రకాష్ సింగ్ బాదల్ మాట్లాడుతూ, నేను చాలా పేదవాడిని, రైతులకి సంఘీభావం తెలిపేందుకు త్యాగం చేయడానికి ఇంకేమీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

రైతులను అగౌరవపరిస్తే ఈ గౌరవం నాకు అవసరం లేదు
నేను రైతుల సేవలకు అన్నింటికీ రుణపడి ఉన్నాను. వారి వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. రైతులను అగౌరవపరిస్తే అలాంటి వారు ఇచ్చిన గౌరవాలను తీసుకోవటంలో అర్థం లేదు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఉదాసీనత చూపించటం , రైతులకు ద్రోహం చేయడం వల్ల నేను తీవ్రంగా బాధపడుతున్నాను అని ప్రకాష్ సింగ్ బాదల్ తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పౌర గౌరవాన్ని తిరిగి ఇచ్చాడు.
దేల్హిలో ఎముకలు కోరికే చలిలో ముక్త కంఠంతో పోరాటం చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేకపోవటం తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు.

రాం నాథ్ కోవిండ్ కు రాసిన లేఖలో రైతుల కోసం ఆవేదన వ్యక్తం చేసిన బాదల్
అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో ఈ మేరకు తన ఆవేదన ప్రకటించిన ప్రకాష్ సింగ్ బాదల్ రైతు తన జీవించే ప్రాథమిక హక్కును పొందటానికి తీవ్రమైన చలిలో విషమ పోరాటం చేస్తున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఇ-మెయిల్ చేసిన ఒక లేఖలో, రైతులపై ప్రభుత్వ వైఖరి , చర్యల వల్ల బాదల్ బాధ పడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం రైతులను బాధపెడుతుంది అంతేకాదు దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేస్తుంది అని పేర్కొన్నారు .

రైతులను మోసం చేస్తున్నారని లేఖలో పేర్కొన్న బాదల్
భారత ప్రభుత్వం ఆర్డినెన్సులను, సంబంధిత బిల్లులను తీసుకువచ్చేటప్పుడు, తరువాత చట్టాలను తీసుకువచ్చేటప్పుడు రైతుల భయాలు తొలగించాలి . వారి ఆందోళన పరిష్కరించాలి. ప్రభుత్వం ఆ విధంగా పరిష్కరిస్తుందనే తాను కూడా కేంద్రం చెప్తున్న మాట నమ్మమని రైతులకు విజ్ఞప్తి చేశాను. కానీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
పంజాబ్ నాయకుడు కేంద్రం రైతులకు వ్యతిరేకంగా మత మరియు వేర్పాటువాద వ్యాఖ్యలపై మండిపడ్డారు.

వ్యవసాయ ,మార్కెటింగ్ చట్టాలకు నిరసనగా ఎన్డీయే కూటమి నుండి వైదొలగిన శిరోమణీ అకాలీ దళ్
మాజీ ముఖ్యమంత్రి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన మరియు ఇబ్బందికరమైన క్షణం రైతులను బాధ పెడుతున్న ఈ క్షణం అని అభివర్ణించారు.మాజీ అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి తన పద్మ భూషణ్‌ను తిరిగి ఇచ్చారు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) లో ఒకటైన శిరోమణి అకాలీదళ్ 2020 సెప్టెంబరులో బిజెపితో సంబంధాలను తెంచుకుంది . కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ ,మార్కెటింగ్ చట్టాలకు నిరసనగా కూటమి నుండి వైదొలిగింది.