వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశంలోనే తొలిలోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక దేశంలోని పలు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరిలో జస్టిస్ దిలీప్ బీ భోసలే, ప్రదీప్ కుమార్ మొహంతీ, అభిలాష కుమారితో పాటు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి అజయ్ కుమార్ త్రిపాఠీలు లోక్‌పాల్‌లో జుడీషియల్ సభ్యులుగా ఉంటారు.

అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్

ఇక సశస్త్రసీమాబల్ తొలి ఛీఫ్‌గా పనిచేసిన అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ సీఎస్ దినేష్ కుమార్ జైన్, ఐఆర్ఎస్ మాజీ అధికారి మహేందర్ సింగ్, గుజరాత్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి ఇంద్రజీత్ ప్రసాద్ గౌతంలు లోక్‌పాల్‌లో సభ్యులుగా ఉంటారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిగా పదవీవిరమణ 2017 మేలో చేశారు జస్టస్ పీసీ ఘోష్. ఇక ఆ తర్వాత ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్‌లో సభ్యునిగా సేవలందించారు. ఆ తర్వాత లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

Former SC Judge Justice PC Ghose takes oath as Indias first Lokpal

ఇదిలా ఉంటే కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వారిపై కొరడా ఝుళిపించనుంది.ఈ లోక్‌పాల్ బిల్లు 2013లో పాస్ అయ్యింది. ఇక నిబంధనల ప్రకారం ఛైర్‌పర్సన్‌తో పాటు ఎనిమిది మంది సభ్యులు ప్యానెల్‌లో ఉంటారు. ఇందులో నలుగురు జుడీషియల్ సభ్యులుగా ఉంటారు. ఇక సభ్యులుగా ఉన్నవారిలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఇతర వెనకబడిన వర్గాల వారు, మైనార్టీలు, మహిళలతో కలిపి 50శాతం కంటే తక్కువగా ఉండరాదని నిబంధనలు తెలుపుతున్నాయి.

ఇక లోక్‌పాల్ ఛైర్‌పర్సన్ ఈ పదవిలో ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కొనసాగుతారు. ఛైర్‌మెన్ వేతనం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ వేతనంతో పాటు సమానంగా ఉంటుంది. ఇక ఇందులో సభ్యులుగా ఉన్నవారి జీతభత్యాలు సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా ఉంటాయి.

English summary
President Ram Nath Kovind Saturday administered the oath of office to Justice Pinaki Chandra Ghose as the country's first Lokpal.The oath was administered at a ceremony held at Rashtrapati Bhavan, a communique issued by the President's office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X