చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అరెస్టు చేసిన లక్ష్మినారాయణ్ ఐపీఎస్ మృతి, సంచలనాలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అవినీతి ఆరోపణలపై మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అరెస్టు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ డీజీపీ వీఆర్. లక్ష్మీనారాయణ్ (91) అనారోగ్యంతో మృతి చెందారు. చాలకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న వీఆర్. లక్ష్మినారాయణ్ అనారోగ్యంతో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

1951 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మినారాయణ్ తమిళనాడులోని మధురై సపరెండెంట్ ఆఫ్ పోలీస్ గా భాద్యతలు స్వీకరించారు. అనంతరం నిజాయితీ పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న వీఆర్. లక్ష్మినారాయణ్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరించారు.

Former Tamil Nadu DGP VR Lakhminarayanan who arrested late PM Indira Gandhi passed away in Chennai

Recommended Video

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకుల నిరసన

అప్పటి ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ ల హయాంలో పని చేసి నిజాయితీ పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి ప్రాని ఇందిరా గాంధీని అరెస్టు చేసిన వీఆర్. లక్ష్మినారాయణ అప్పట్లో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు.

1985లో తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) పని చేసి రిటైడ్ అయిన వీఆర్. లక్ష్మినారాయణ్ తమిళనాడులోని చెనైలో కుటుంబ సభ్యులతో అక్కడే స్థిరపడ్డారు. వీఆర్. లక్ష్మినారాయణ్ కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చాల కాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న వీఆర్. లకష్మినారాయణ్ ఆదివారం పొద్దుపోయిన తరువాత కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

జూన్ 25వ తేదీ వీఆర్. లక్ష్మినారాయణ్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. మాజీ పోలీసు అధికారి వీఆర్. లక్ష్మినారాయణ్ మృతికి పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

English summary
Former Tamil Nadu DGP VR Lakhminarayanan who arrested late PM Indira Gandhi passed away in Chennai on Sunday at the age of 91.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X