వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ టెక్కీ 28 జాబ్స్, అమ్మో హైదరాబాద్ జాబ్!

By Pratap
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: వాస్తవానికి ప్రతి ఒక్కరూ స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన జీవితం కోరుకుంటారు. ఏదో ఓ చోటు పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని స్థిరపడాలని అనుకుంటారు. కానీ, ఓ యువకుడు అందుకు భిన్నంగా ఉన్నాడు. ఒడిశాలోని భవనేశ్వర్‌కు చెందిన 29 ఏళ్ల మాజీ టెక్కీ ఒకతను 28 వారాల్లో 28 ఉద్యోగాలు చేశాడు.

ఆ ఉద్యోగాలు కూడా అతను ఏదో ఒక చోట, ఒక రాష్ట్రంలో చేయలేదు. ఒకే రకమైన ఉద్యోగం కూడా చేయలేదు. దేశంలోని 28 రాష్ట్రాల్లో అతను వారానికి ఓ రాష్ట్రంలో ఉద్యోగం చేశాడు. ఇది వరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే 29 రాష్ట్రాల్లో చేసి ఉండేవాడేమో. ఫొటోగ్రాఫర్‌గా, ఉపాధ్యాయుడిగా, ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్‌గా, ఎమోషనల్ సపోర్ట్ కన్సల్టెంట్‌గా, రివర్ రాఫ్టింగ్ గైడ్‌గా, శవ సంస్కార సహాయకుడిగా పనిచేశాడు.

Former-techie travels across the country, does 28 jobs in 28 weeks

చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి జుబనేశ్ మిశ్రా 2013 మేలో తన ప్రాజెక్టును ప్రారంభించాడు. అస్సాంలో టీ పిక్కర్‌గా పనిచేశాడు. నాగాలాండ్‌లో హార్డ్‌వేర్ స్టోర్ అసిస్టెంట్‌గా, కర్ణాటకలో ఎమోషనల్ సపోర్ట్ కన్సల్టెంట్‌గా, ఉత్తరాఖండ్‌లో పాలీఫామ్ వర్కర్‌గా పనిచేశాడు.

తల్లిదండ్రుల మితిమీరిన జోక్యం వల్ల, మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల చాలా మంది భారతీయ యువకులు వైద్యం, ఇంజనీరింగ్ విద్యలతో ముగిస్తారని, స్వప్నాలను తుడిచిపెట్టుకుంటారని, దాన్ని తాను బద్దలు కొట్టి ఇష్టమైనదాన్ని ఎంచుకునేందుకు ఇతరులకు ప్రేరణ ఇవ్వాలని తాను ఇలా చేశానని అతను చెప్పాడు.

తన మొత్తం ప్రాజెక్టుల్లో హైదరాబాదులో ప్రీ స్కూల్ టీచర్‌గా పనిచేయడం కష్టంగా తోచిందని మిశ్రా యుకెకు చెందిన డైలీ మెయిల్‌కు చెప్పాడు. ఓ చిన్న గదిలో రెండేళ్ల వయ్ససు గల పిల్లలు 20 మంది ఏడుస్తుంటే వారిని ఓదార్చడం అత్యంత కష్టమైన పని అన్నాడు.

ప్రస్తుతం మిశ్రా తన సొంత రాష్ట్రం ఒడిశాలో రచయితగా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నాడు. వన్ వీక్ జాబ్ ఇండియా అనే తన ప్రాజెక్టుకు నెట్‌వర్కింగ్ సైట్లలో అనూహ్యమైన స్పందన లభించిందని చెప్పాడు.

English summary

 In a society which values a steady, successful career and money more than anything else, here is a man who decided to do something different. The 29-year-old former-engineer from Bhubaneswar tried out 28 new jobs in 28 weeks ! The jobs took him to all 28 states in India, where he lived for one week each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X