వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెరీ మాజీ చీఫ్ ఆర్కే పచౌరి కన్నుమూత, గుండెపోటుతో కుప్పకూలి..

|
Google Oneindia TeluguNews

పర్యావరణ వేత్త, టెరీ ( ద ఎనర్టీ అండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్) మాజీ చీఫ్ ఆర్కే పచౌరి చనిపోయారు. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో మృతిచెందారని టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్ మథూర్ పేర్కొన్నారు. ఢిల్లీ ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో చనిపోయారని ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పచౌరి మృతిపై డైరెక్టర్ జనరల్, చైర్మన్, ఉద్యోగులు, సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.

'ఆర్కే పచౌరి చనిపోయారు, ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.. విచారకరంగా ఉంది. టెరీ కుటుంబం దు:ఖసాగరంతో నిడిపోయిందన్నారు. పచౌరి యొక్క అవిశ్రాంత కృషి వల్ల టెరీ ప్రముఖ కంపెనీగా మారింది. ఆయన కృషి వల్లే సంస్థకు మంచి పేరు వచ్చిందని, సమాజంలో గౌరవం దక్కింది' అని అజయ్ ట్వీట్ చేశారు. 2015లో ఆర్కే పచౌరి తర్వాత డైరెక్టర్ జనరల్‌గా అజయ్ మాథూర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు రావడంతోనే టెరీ చీఫ్ పదవీ నుంచి పచౌరి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Former TERI chief RK Pachauri passes away

ప్రపంచ సుస్థిరాభివృద్ధి కోసం ఆర్కే పచౌరి చేసిన సేవలు అసమానమైనదని టెరి చైర్మన్ నితీశ్ దేశాయ్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఆయన ఇదివరకే హెచ్చరించారని పేర్కొన్నారు. పచౌరి తీసిన చర్చ నేడు వాతావరణ మార్పులపై చర్చించి, చర్యలు తీసుకొనేందుకు దోహదపడిందన్నారు. పచౌరీ లేరనే విషయాన్ని అతని సహచరులు, స్నేహితులు.. పచౌరి ఉన్న జ్ఞాపకాలను [email protected] మెయిల్‌ ద్వారా పంచుకోవాలని సంస్థ ట్వీట్ ద్వారా తెలిపింది.

English summary
former TERI chief RK Pachauri passed away on Friday after prolonged cardiac ailment. TERI Director General Ajay Mathur said on Friday that former TERI chief RK Pachauri has passed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X