వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.... బ్రీతింగ్, హర్ట్ సమస్య తీవ్రం

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలెటర్‌ మీద ఉంచారు. శ్వాసతోపాటు, గుండే సరిగా స్పందించకపోవడంతో ఈసిఎంఓ ద్వార చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు డయాలసిస్ కూడ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరాని, రాంవిలాస్ పాశ్వాన్‌లతో పాటు ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌, భాజపా నేత సతీశ్‌ ఉపాధ్యాయ్‌, కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వి, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బీరేంద్ర సింగ్‌లు అసుపత్రికి చేరుకున్నారు.

శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందికిగురవుతున్న అరుణ్ జైట్లి ఆగస్టు 9నుండి ఎయిమ్స్‌లో చికిత్స పోందుతున్నారు. కాగా అంతకుముందు కొద్ది నెలల నుండి ఆనారోగ్య కారణలతో చికిత్స పోందుతున్న జైట్లికి ఆరోగ్య పరిస్థితిపై గత శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు పరిస్థతి బాగానే ఉందని చెప్పారు. ఇక గత వారం నుండి ఎలాంటీ హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఈ దీంతో గత వారమే అరుణ్ జైట్లిని ప్రధాని మోడీతోపాటు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Former Union Minister Arun Jaitleys continued to be life support system,visits top leaders

అరుణ్‌జైట్లి అనారోగ్యం కారణంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయలేదు. కాగా గత ప్రభుత్వంలోనే ఆర్ధికమంత్రిగా ఉన్న జైట్లి అనారోగ్యం కారణంగా పియుష్ గోయల్ కొన్ని రోజులు బాధ్యతలు చేపట్టారు. అనంతరం తిరిగి గత ఆగస్టు నుండి మంత్రిత్వ బాధ్యతలు స్వికరించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.

English summary
Former finance minister Arun Jaitley continued to be life support system on Sunday even as a bevvy of politicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X