వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ కేంద్రమంత్రి హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాట మాజీ గవర్నర్, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి హన్స్‌జ్ భరద్వాజ్(83) ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హన్స్‌జ్ భరద్వాజ్ బుధవారం ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Holi 2020 | COVID-19| Yes Bank| Northern California Earthquake

ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. హన్స్‌జ్ భరద్వాజ్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌జ్ భరద్వాజ్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిగంబోద్ ఘాట్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు అర్జున్ భరద్వాజ్ తెలిపారు.

 Former Union Minister Hansraj Bhardwaj Passes Away

కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన హన్స్‌జ్ భరద్వాజ్.. ఆ తర్వాత కర్ణాటక, కేరళ గవర్నర్‌గా సేవలందించారు. 2009-2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్‌గా సేవలందించారు. జనవరి 2012-మార్చి 2013 వరకు కేరళ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

కాగా, హన్స్‌జ్ భరద్వాజ్ రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. ఇందిరా గాంధీ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు హయాంలో 9ఏళ్లపాటు న్యాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. భరద్వాజ్ మృతి పట్ల కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.

English summary
Former Union minister and senior Congress leader Hans Raj Bhardwaj passed away on Sunday at the age of 82.Bhardwaj served as the Union Law Minister and Governor of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X