• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దొరికిపోయిన దొంగ కేసీఆర్.!కాదని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం.!మెడమీద కత్తి అంటే ఏంటో చెప్పాలన్న రేవంత్.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దొంగలా దొరికిపోయాడని, అందుకే బీజేపి మీద కారాలు మిరాయాలు నూరుతూ రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నాడని టీపిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపి, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు పార్లమెంట్ సాక్షిగా వెలుగులోకి వచ్చాయని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అసలు మెడమీద కత్తి అంటే ఏంటో, ఆ పదాన్ని చంద్రశేఖర్ రావు ఎందుకు ప్రయోగించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

మెడ మీద కత్తి పెడితే సంతకం పెట్టిన కేసీఆర్.. ప్రత్యామ్నాయ పంట గురించి ఎందుకు చెప్పలేదన్న రేవంత్

మెడ మీద కత్తి పెడితే సంతకం పెట్టిన కేసీఆర్.. ప్రత్యామ్నాయ పంట గురించి ఎందుకు చెప్పలేదన్న రేవంత్

యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనడం లేదంటూ చంద్రశేఖర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి యావత్ రైతాంగానికి అండగా నిలబడాల్సిందని ప్రశ్నించారు. ధాన్యం కొని రైతులను ఆదుకోనప్పుడు మరి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నట్టు అని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు భావించాయని, ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన రైతులు, రైతులపై కేసులు, కనీస మద్ధతు ధర గురించి మాట్లాడే అవకాశం లభించేదని, కానీ సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్ఎస్ ముందుకొచ్చిందని, టీఆర్ఎస్ ఆందోళనతో చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు పాస్ చేసుకున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

పార్లమెంట్ లో కావాలనే ఆందోళన.. ఆందోళన రూపంలో బీజేపికి సహకరిస్తున్న టీఆర్ఎస్

పార్లమెంట్ లో కావాలనే ఆందోళన.. ఆందోళన రూపంలో బీజేపికి సహకరిస్తున్న టీఆర్ఎస్

గులాబీ ప్రభుత్వానికి నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లోనే ముగ్గురు సభకు ఎందుకు రాలేదని. వరి వేసుకున్న రైతులు ఉరేసుకునేలా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్నాయిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనకపోవడంతో రైతులు కార్పొరేట్ శక్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయని మండిపడ్డారు. ఆదానీ, అంబానీలకు రైతులు వారి పంటలను అమ్ముకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారని, దేశానికే అన్నపూర్ణ తెలంగాణ అని చెప్పిన సీఎం చంద్రశేఖర్ రావు వరి ధాన్యాన్నే కొనకుండా చేసాడని, వరితో పాటు ఏ పంటనూ కొనూ పరిస్థితులు లేకుండా చేసారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మెడపై కత్తి అంటే ఏంటి.. తెలంగాణ సమాజానికి చెప్పాలన్న రేవంత్ రెడ్డి..

మెడపై కత్తి అంటే ఏంటి.. తెలంగాణ సమాజానికి చెప్పాలన్న రేవంత్ రెడ్డి..

వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ చంద్రశేఖర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని అన్నారు. కేంద్రం కొనకపోతే రాష్ట్రం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడకపోతే ఆ ప్రభుత్వం ఎందుకని నిలదీసిరు. చంద్రశేఖర్ రావు దొంగలా దొరికిపోయాడు కాబట్టే, కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అసలు మెడ మీద కత్తి అనే పదానికి అర్థం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యానన్ని కొననప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు ఉందా అని చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

  Kangana Ranaut బోల్డ్ పోస్ట్... అరెస్టు చెయ్యడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది...! | Oneindia Telugu
  అవగాహనతోనే డ్రామాలు.. బీజేపి, టీఆర్ఎస్ పై మండిపడ్డి రేవంత్ రెడ్డి

  అవగాహనతోనే డ్రామాలు.. బీజేపి, టీఆర్ఎస్ పై మండిపడ్డి రేవంత్ రెడ్డి

  గతంలో రైతులు వరికి బదులు మొక్కజొన్న, చెరకు, పత్తి పండిచే సంస్క్రుతి ఉంటే దానికి విరుద్దంగా ఆ పండించవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారని, పప్పు దినుసులు పండిస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర లేకుండా చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో మిర్చి గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తే వారికి బేడీలు వేయించారని, కేంద్ర ప్రభుత్వం కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు వాటికి గిట్టుబాటు ధరతో పాటు రైతులకు సరైన వసతులు కల్పించాలని, ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  English summary
  MP Revanth Reddy, who was attending Parliament sessions, spoke to reporters on Tuesday afternoon at Telangana Bhavan in Delhi. On this occasion, the BJP and TRS made strong remarks that the politics of the conspiracy came to light as a parliamentary witness.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X