సీఎంగా యడ్యూరప్పతో పాటు నలుగురు మంత్రులు, బీజేపీ ప్లాన్: చివరి నిమిషంలో రివర్స్ !
Recommended Video

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్పతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని బుధవారం అర్దరాత్రి ప్రచారం జరిగింది. బీజేపీకి చెందిన నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చెయ్యడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించిందని మొదట ప్రచారం జరిగింది.
కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా ఆహ్వానం మేరకు మొదట బీఎస్. యడ్యూరప్ప మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ నాయకులు అర్దరాత్రి ప్రచారం చేశారు.

బీజేపీ సీనియర్ నాయకులు బళ్లారి బి. శ్రీరాములు, ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, గోవింద కారజోళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు మొదట తెలిపాయి. కాంగ్రెస్ పార్టీలోని లింగాయుత ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారని, బీజేపీ ప్రభుత్వం నిలబడుతుందని సమాచారం. అయితే చివరి నిమిషంలో యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ఎవ్వరూ ప్రమాణస్వీకారం చెయ్యలేదు.












Click it and Unblock the Notifications