వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేఎం జోసెఫ్ పేరు ప్రతిపాదన: కొలీజియం భేటీకి జస్టిస్‌ చలమేశ్వర్‌ వినతి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి అత్యవసరంగా సిఫారసు చేసేందుకు కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కోరారు.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాశారు.
జస్టిస్‌ జోసఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్‌ చలమేశ్వర్‌ తన లేఖలో పునరుద్ఘాటించినట్లు సర్వోన్నత న్యాయస్థానం అధికారవర్గాలు తెలిపాయి.

Four Collegium judges meet, pressure on CJI to reiterate Justice K M Joseph’s name

జస్టిస్‌ జోసఫ్‌ నియామకానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈ లేఖలో ఆయన సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ జోసఫ్‌ పేరును కొలీజియం సిఫార్సు చేసిన జనవరి 10 నుంచి నేటి వరకు పరిస్థితులు ఏమీ మారనందున ఆయనను నియమించాలని కోరినట్లు తెలిపాయి.

కోలీజియం సిఫార్సుల్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సీనియారిటీ సహా పలు ఇతర కారణాలను చూపుతూ జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును గతనెలలో తిప్పిపంపింది. కాగా, జస్టిస్‌ చలమేశ్వర్‌ లేఖ నేపథ్యంలో కొలీజియం సమావేశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
A brief informal meeting of four of the five most senior judges of the Supreme Court took place on Wednesday afternoon where finalisation of the Memorandum of Procedure (MoP) and the reiteration of Justice K M Joseph’s name for elevation to the apex court were discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X