వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో విషాదం.. బొగ్గు గనిలో ప్రమాదంతో నలుగురు మృతి..

|
Google Oneindia TeluguNews

ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని కింద కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. బొగ్గు బరువుతో పాటు ఊపిరాడక నలుగురు వెంటనే ప్రాణాలు వదిలారు. మిగిలిన వారిని తోటి సిబ్బంది బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు.

మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంతో ఈ ఓపెన్ కాస్ట్ గనిని మూసివేశారు. ఈ గని నుంచి నిత్యం 20వేల టన్నుల బొగ్గును వెలికితీస్తారు. మైన్‌లో తిరిగి పని ప్రారంభించేందుకు వారం రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Four dead, 9 injured in landslide at Odisha coal mine

భారత్‌లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తారు. 2018లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా, సింగరేణి కాలొరీస్ కంపెనీ లిమిటెడ్‌లో సగటున వారానికి ఒకరు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అక్రమ బొగ్గు మైనింగ్ జరుగోతంది. సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వాటిల్లోనూ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ మేఘాలయాలోని ఓ అక్రమ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 15మంది కార్మికులుచిక్కుకున్నారు. మేఘాలయాలో ఇలాంటి ప్రమాదాల్లో ఇప్పటి వరకు వేల మంది కార్మికులు చనిపోయారు. వారిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు.

English summary
Four workers are feared dead and nine have been injured in a landslide at a Coal India Ltd mine in Odisha. The open cast mine with production capacity of 20,000 tonnes a day, had been shut after the late Tuesday accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X