వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడి దర్శనలో అపశృతి... క్యూలైన్ తొక్కిసలాటలో నలుగురు భక్తుల మృతి...

|
Google Oneindia TeluguNews

మంచి జీవితాన్ని ప్రసాదించమని దేవుడిని కోరేందుకు వెళితే ఏకంగా ప్రాణాలనే హరించాడు దేవుడు..దర్శనం కోసం వెళ్లిన భక్తులను తనదాక రాకుండా చేశాడు. తమిళనాడులోని కాంచీపురంలో రాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు మృతి చెందారు.

four including a woman pilgrims were dead in a Tamil Nadu temple

తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. కాగా ఉత్సవాలు మొత్తం 48 రోజుల పాటు కొనసాగుతాయి.అయితే రోజవారిగా కాకుండా నేడు శ్రవణా నక్షత్రంలో కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు.అయితే ఆలయ నిర్వహాకులు భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో ఒక్కసారిగా భక్తులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఓ మహిళతోపాటు నలుగురు భక్తులు సోమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ అనే భక్తురాలు కూడ ఉంది.

English summary
four including a woman pilgrims were dead in a attivarada swamy celebrations in Kanchipuram, Tamil Nadu. when huge piligrims in que line Stampede.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X