వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: నలుగురు కర్ణాటక మంత్రులు క్వారంటైన్.. నిబంధనలు యధేచ్చగా బేఖాతరు, సమీక్షల పేరుతో..

|
Google Oneindia TeluguNews

కర్ణాటక నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఓ వీడియో జర్నలిస్ట్ వారిని కలువడంతో.. క్వారంటైన్‌లోకి వెళ్లారు. బెంగళూరు సిటీలో జర్నలిస్టు పర్యటించారు. అయితే అతనికి ఈ నెల 24వ తేదీన వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతను ఇటీవల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ, హోం మంత్రి బసవరాజు బొమ్మై, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి సీటీ రవి, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్‌తో కలిశారు.

నలుగురికి నెగిటివ్..

నలుగురికి నెగిటివ్..

అయితే నలుగురు మంత్రులు పరీక్ష చేసుకోగా.. నెటివివ్ వచ్చింది. కానీ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ వారు 7 రోజులు కూడా లేదు. కానీ మాండ్యలో వైద్యారోగ్యశాఖ మంత్రి అధికారులతో సమీక్షించారు. అదేంటి క్వారంటైన్ నిబంధనలను బేఖాతరు చేశారని అడిగితే.. 7 రోజులు క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పారు. తర్వాత బయటకొచ్చానని.. చెప్పి తాను మంత్రినని చెప్పకనే చెప్పారు.

మిగతా మంత్రులు కూడా..

మిగతా మంత్రులు కూడా..


సుధాకర్ కాదు ఇతర మంత్రులు కూడా నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యటిస్తున్నారు. తనకు నెగిటివ్ వచ్చిందని.. అయినా తాను క్వారంటైన్‌లో ఉన్నానని అశ్వత్ నారాయణ సమర్థించుకున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని మరో మంత్రి బొమ్మై పేర్కొన్నారు. తనను కెమెరామెన్‌ను కలువలేదు అని మరో మంత్రి సీటీ రవి తెలిపారు. కానీ ఏప్రిల్ 28వ తేదీన జరిగిన తనకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

సరికాదు..

సరికాదు..

కర్ణాటక మంత్రుల తీరును పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తప్పుపట్టారు. వైరస్ సోకిన వీడియో జర్నలిస్టును కలిసి.. క్వారంటైన్ నిబంధనలను బేఖాతరు చేస్తారా అని ప్రశ్నించారు. ఇది నిబంధనలను తుంగలో తొక్కడం కాదా అని ప్రశ్నించారు. వీరంతా సీఎం, ఇతరులతో సమావేశం కాలేదా...? వారికి వైరస్ సోకితే ఎవరూ బాధ్యులు అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన మంత్రులు ఎందుకు క్వారంటైన్‌లో ఉండటం లేదు అని ప్రశ్నించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతూ.. మీరు మాత్రం నిబంధనలను ఉల్లంఘించొచ్చా అని అడిగారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం కూడా సీరియస్‌గా లేదని అర్థమవుతోందని మండిపడ్డారు.

Recommended Video

Stock Market Update : Sensex Up 862 Points And Near 34K, Nifty Holds 9,800 Mark

English summary
Four Karnataka ministers came in contact with the COVID-19 positive video journalist of a Kannada news channel recently, on Wednesday said they have tested negative for the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X