వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: 5 నెలలుగా ఇంట్లోనే తల్లి శవం, రూ.13 వేల కోసం కొడుకుల కక్కుర్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: పెన్షన్ కోసం చనిపోయిన తల్లి మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించకుండా సుమారు ఐదు మాసాలుగా నలుగురు కొడుకులు దాచిపెట్టారు. తన తండ్రి పెన్షన్ తీసుకొనేందుుకే తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ శవాన్ని భద్రపర్చారు. ఈ విషయం ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని మార్క్స్ తన రచనల్లో చెప్పాడు. అక్షరాల ఈ మాటలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ నలుగురు సుపుత్రులకు వర్తిస్తాయి. ఆర్థిక అంశాలే మినహా మానవ సంబంధాలను వీరు మరిచిపోయారు.

డబ్బే పరమావధిగా జీవనం సాగించారని తేలింది. తమ తండ్రి పెన్షన్ డబ్బుల కోసం తల్లి చనిపోయినా కానీ, ఆమె చనిపోలేదని అందరిని నమ్మించారు. సుమారు ఐదు మాసాల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచారు.

5 నెలలు తల్లి శవం ఇంట్లోనే

5 నెలలు తల్లి శవం ఇంట్లోనే


ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణానికి చెందిన కబీర్ నగర్ లో అమరావతి దేవికి ఐదుగురు కొడుకులు, ఓ కూతురు. అయితే ఆమె తన నలుగురు కొడుకులు, ఓ కుమార్తెతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. మరో కొడుకు మాత్రం వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అమరావతి భర్త కస్టమ్స్ శాఖలో పనిచేసి మరణించారు. దీంతో ఆమెకు ప్రతి నెల రూ13 వేల రూపాయాలు పెన్షన్ గా వచ్చేది. ఈ ఏడాది జనవరి మాసంలో అమరావతి దేవీ కూడ మరణించారు. తండ్రి పెన్షన్ డబ్బుల కోసం తల్లి మరణించలేదని నమ్మించి ఐదు మాసాల పాటు తండ్రి పెన్షన్ ను తీసుకొన్నారు. శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టారు.

తొలుత చనిపోయిందని, ఆ తర్వాతో కోమాలోకి

తొలుత చనిపోయిందని, ఆ తర్వాతో కోమాలోకి


ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి దేవికి ఈ ఏడాది జనవరి మాసంలో ఆనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రిలో చేర్పించినా కానీ, ఆమె ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే అమరావతి దేవి మరణించిందని తొలుత కొడుకులు ప్రకటించారు. అయితే ఆమె చిన్న కొడుకు మాత్రం అమరావతి దేవి చేయి కదులుతోందని చెప్పారు. దీంతో ఆమె చనిపోలేదని కోమాలోకి వెళ్ళిపోయిందని మళ్ళీ తేల్చారు. పెన్షన్ కోసమే తల్లి చనిపోలేదని కొడుకులు ప్రకటించారు.

మృతదేహం వాసన రాకుండా చర్యలు

మృతదేహం వాసన రాకుండా చర్యలు

అమరావతి దేవి మృత్యువాత పడినా ఆమె చనిపోలేదని ఆ కొడుకులు ఆమె ఇంకా బతికే ఉందని చెప్పారు. అయితే తమ తండ్రి పెన్షన్ డబ్బుల కోసమే ఈ రకంగా వ్యవహరించారు. అయితే మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు గాను ఐదు మాసాల పాటు ఆ మృతదేహన్ని రసాయనాలతో ముంచెత్తారు. ఈ రసాయనాల కారణంగా ఆ మృతదేహం నుండి వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

 గుట్టు రట్టు చేసిన పోలీసులు

గుట్టు రట్టు చేసిన పోలీసులు

అయితే పెన్షన్ డబ్బుల కోసం తల్లి మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచిన విషయాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అమరావతిదేవి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే అసలు విషయం వెలుగు చూసింది. అప్పటికే మృతదేహం నుండి కుళ్ళిన వాసన వేస్తోంది. దీంతో నలుగురు కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్నారు.

English summary
Four men allegedly preserved the body of their 70-year-old mother with chemicals for five months to draw her pension in Kabir Nagar area of Varanasi, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X