వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: నలుగురు మావోయిస్టుల మృతి

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కమాండర్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 పిస్తోళ్లు, 303 రైఫిల్, 315 బోర్ రైఫిల్, 12 బోర్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజి ఎస్ఆర్‌పి కళ్లూరి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 55మందితో కూడిన డిఆర్జీ బృందం పాల్గొన్నట్లు చెప్పారు.

Four Naxals killed in encounter with police in Chhattisgarh

బోల్తా పడ్డ బస్సు: నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లాలోని రాణిరత్ సమీపంలో రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జల్పాయిగురి సర్ధార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అతివేగంతో వెళ్తున్న బస్సు రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం బోల్తా పడిందని చెప్పారు. దూప్ గురి నుంచి జమర్ధహ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

English summary
Four Naxals, including a commander-rank cadre, were on Friday killed in a fierce gun-battle with police in Chhattisgarh's Bijapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X