వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలాకోట్ పై పాకిస్థాన్ మరో డ్రామా .. నలుగురే చనిపోయారంటూ లీకులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బాలాకోట్ దాడులపై పాకిస్థాన్ మరో డ్రామాకు తెరతీసింది. ఇన్నాళ్లు తమపై వైమానిక దాడులు జరగలేదని చెబుతూ వచ్చిన పాకిస్థాన్ .. తాజాగా మాట మార్చింది. బాలాకోట్ దాడిలో నలుగురే చనిపోయారని మీడియాకు లీకులిచ్చి తన కపటనీతిని బయటపెట్టుకుంది. దాడి జరిగి 15 రోజులైనా తర్వాత కొద్దీమందే చనిపోయారని చెప్పి ఉగ్ర శిబిరాలపై తనకున్న ప్రేమను మరోసారి మీడియాముఖంగా చాటుకుంది.

<strong>రేపు మరోసారి ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ .. ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీకి బస్సుల్లో ఎమ్మెల్యేలు</strong>రేపు మరోసారి ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ .. ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీకి బస్సుల్లో ఎమ్మెల్యేలు

ఎందుకీ డ్రామా ?

ఎందుకీ డ్రామా ?

దాయాది పాకిస్థాన్ ఎప్పుడూ ఒకే మాట నిలబడదని మరోసారి రుజువైంది. గత నెలలో బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై చేసిన దాడులను భారత్ ధృవీకరించగా .. అదేం లేదని, దాడి జరగలేదని అబద్ధాలు చెప్పింది. అంతేకాదు చెట్లపై, మూగజీవాలపై బాంబులు వేశారని మరోసారి ప్రకటించింది. పర్యావరణానికి హానీ తలపెట్టారని కేసు పెట్టి తన వైఖరిని చాటే ప్రయత్నం చేసింది. తాజాగా సోమవారం బాంబు దాడి జరిగిందని స్థానికులతో చెప్పించి .. తనది ఊసరవెళ్లి మనస్థత్వమని మరోసారి నిరూపించుకుంది.

మరి ఆ 300 ఫోన్లు ఎవరివీ ?

మరి ఆ 300 ఫోన్లు ఎవరివీ ?


బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంపై గతనెల 26న వైమానిక దాడులు చేపట్టాయి. ఆ సమయంలో శిక్షణ శిబిరంలో 300 ఫోన్లు పనిచేస్తున్నాయని భారత అధికారులు పేర్కొన్నారు. దాదాపు 350 మంది ఉగ్రవాదులు, శిక్షణ నిచ్చేవారు, మసూద్ అజహర్ తమ్ముడు, బావమరిది మృతిచెందారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమ దేశంలో ఉగ్రవాద శిబిరం లేదనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి స్థానిక మజీదులో పనిచేసే ఓ కూలి చేత దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వైమానిక దాడుల తర్వాత నలుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయారని చెప్పించి .. మృతుల సంఖ్య తగ్గిద్దామని చూసింది.

ఆంక్షలెందుకు ?

ఆంక్షలెందుకు ?

బాలాకోట్ దాడికి సంబంధించి ఆధారాలు సేకరిద్దామని మీడియా ప్రయత్నించింది. అయితే పాకిస్థాన్ అంతర్జాతీయ మీడియాను కూడా ఉగ్రవాద శిబిరం దరిదాపుల్లోకి రానీయలేదు. రాయిటర్స్ మీడియా సంస్థ కవరేజీకి వెళ్లగా .. దూరం నుంచి ఫోటోలు తీసుకోమని హుంకరించడంతో ... ఆ రిపోర్టర్లు కూడా పాకిస్థాన్ తీరును తప్పుపట్టారు. శిబిరం ధ్వంసమైతే చూపించాల్సంది పోయి .. ఆంక్షలు విధించడం ఏంటని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించింది.

English summary
at least four Pakistan Army men could have died in the Indian Air Force (IAF) airstrikes in Balakot on February 26, a local mosque worker of the area has revealed. India Today TV dialled police officers in PoK, local clerics in Balakot and Jaish-e-Mohammed (JeM) commanders elsewhere in Pakistan who have vouched for the Indian bombing and also confirmed that terror fundraising continues to flourishing despite Islamabad announcing a crackdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X