వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపిఎస్ భార్య వేధింపులు, ప్రియురాలి కోసం పోలీసుగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Four persons harass IPS officer's wife inside a mall; arrested
లక్నో/హైదరాబాద్: ఓ ఐపిఎస్ అధికారి భార్యను వేధించారనే ఆరోపణలతో నలుగురు యువకులను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మాల్‌లో షాపింగ్ చేసుకుంటున్న ఐపిఎస్ అధికారి భార్యను వేధించారు. ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ అధికారి భార్య షాపింగ్ చేసుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు ఆకతాయిలు ఆమె వెంటబడ్డారు.

వేధించడం ప్రారంభించారు. వారి వెకిలి వేషాలు భరించలేని ఆమె, పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి తన వివరాలు చెప్పారు. ఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారి భార్య ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాల మీద స్పందించిన పోలీసులు సిసిటివి పుటేజ్ చూసి అకిల్ అహ్మద్, ఇర్షాద్ ఆహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ లను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమ కోసం పోలీసుగా...

ప్రియురాలి కోసం ఓ యువకుడు పోలీసుగా అవతారమెత్తి కటకటాల్లోకి వెళ్లాడు. సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన హైదరాబాదు సంజీవరెడ్డి నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. శ్రీకాంత్ ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఇష్టపడిన అమ్మాయికి ఆ ఉద్యోగం నచ్చలేదు. దాంతో పోలీస్ వేషంలో వెళితే ఆమె ఇంప్రెస్ అవుతుందనుకున్నాడు.

పోలీసు వేషధారణలో బుల్లెట్‌పై ప్రియురాలి దగ్గరకు వెళ్లాడు. పోలీసునంటూ ఆమెకు చెప్పాడు. ఈ నకిలీ పోలీసును చూసిన అసలు పోలీసులు మాత్రం అనుమానంగా చూశారు. అతనిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ జరిపారు. దాంతో అసలు విషయం బయటపడింది.

English summary
Four persons were arrested from a mall in the Hazratganj area in Lucknow, for allegedly teasing the wife of an IPS officer, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X