వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో మరోసారి తెగబడ్డ ముష్కరులు.. సోపోర్‌లో కాల్పులు.. చిన్నారి సహా నలుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సరిహద్దులో దాయాది పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఇప్పటికే చొరబాటుకు కూడా యత్నించగా భద్రతా దళాలు ధీటుగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పౌరులు కూడా మృతిచెందారు. దీంతో సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌ సోపోర్ జిల్లా దంగేర్‌పొరలో విరుచుకుపడ్డారు. పౌరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఓ చిన్నారి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఉస్మాన్ జాన్ సహా మిగతావారి పరిస్థితి స్థిమితంగా ఉందని .. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టామని .. వారి ఆచూకీ కనుగొంటామని చెప్తున్నారు.

Four persons, including a baby, injured as terrorists open fire in Sopore

గతనెల 5న జమ్ముకశ్మీర్ ... కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటీ నుంచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లడాఖ్‌లో ఇప్పటికే 40 వేల మందికిపైగా బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే.

English summary
At least four persons, including a baby, were injured as terrorists open fired in Dangerpora village of Jammu and Kashmir’s Sopore on Saturday, police said. According to police, all the injured, including baby girl Usma Jan, were shifted to the hospital and are stable. The police are at the spot and the investigation is in progress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X