వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 పోలీసుస్టేషన్లు సీజ్, కరోనా వైరస్ సోకడంతో తీరప్రాంత పీఎస్ క్లోజ్.. ఎక్కడంటే..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ చైన్ తెంపేందుకు పోలీసులు ఆలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కానీ కొందరు పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది. వీరిలో కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాలు ఉడుపి, దక్షిణ కన్నడకు చెందిన నాలుగు పోలీసు స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఇక్కడ కరోనా వైరస్ కేసులు నమోదవడంతో పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్... 18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...

ఉడుపి జిల్లాలోని ఆజేకర్, కర్కలా రూరల్, బ్రహ్మవర్ పోలీసు స్టేషన్లలో ఒక్కో పోలీసుకు కరోనా వైరస్ సోకింది. ఆరోగ్య కార్యకర్తల సాయం తీసుకొని.. పోలీసు స్టేషన్లను శానిటైజ్ చేశామని ఎస్పీ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ పోలీసుస్టేషన్లను మూసివేశామని తెలిపారు. ఆ పోలీసు స్టేషన్లను బుధవారం తెరుస్తామని వెల్లడించారు. అప్పటివరకు కర్కాళ సర్కిల్ వద్ద కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Four police stations in Karnataka’s coastal districts sealed..

అంతేకాదు కర్కాళ పోలీసుస్టేషన్‌లో వైరస్ సోకిన వారు నివసిస్తోన్న బీ, సీ బ్లాక్ పోలీసు క్వార్టర్లను కూడా సీజ్ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ పోలీసుస్టేషన్ పరిధిలో పనిచేస్తున్న 100 మందిని ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఆ పోలీసులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను కనుక్కొని.. వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

దక్షిణ కన్నడ జిల్లాలో గల విట్టల్ పోలీసుస్టేషన్‌లో ఒకరికి కోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ కూడా పీఎస్.. క్లోజ్ చేసి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బెంగళూరులో కూడా కానిస్టేబుల్‌కు కరోనా వరస్ సోకింది. ఛామరాజ్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే సమయంలో వైరస్ సోకింది.

English summary
Four police stations in Karnataka’s coastal districts of Udupi and Dakshina Kannada have been sealed after police personnel posted there tested positive for the novel coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X