వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : నేడే నాలుగో విడత పోలింగ్...!! || Oneindia Telugu

ఢిల్లీ : ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ మొదలయ్యే ముందు మాక్ పోలింగ్ పూర్తి చేశారు ఎన్నికల సిబ్బంది. 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది. పలుచోట్ల 6.30 గంటల సమయంలో కొందరు ఓటర్లు క్యూ లో నిల్చున్నారు.

నాలుగో విడతతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మాత్రం ఇదే విడత తొలిదశ. మహారాష్ర్టలో 17, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, ఒడిశా 6, మధ్యప్రదేశ్ 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌లో 1 నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది.

Fourth Phase of 2019 Lok Sabha elections polling is ongoing

నాలుగో విడత ఎన్నికల్లో హేమాహేమీలు బరిలో నిలిచారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సునీల్‌దత్ కూతురు ప్రియాదత్, బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ నుంచి నామినేషన్ వేశారు. చింద్వాడ నుంచి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్, జబల్‌పూర్ నుంచి బీజేపీ నేత రాకేశ్‌సింగ్, సిధీ నుంచి కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ తలపడుతున్నారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోధ్‌పూర్‌ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌ తో వైభవ్ తలపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి బీజేపీ లీడర్ బాబుల్ సుప్రియో పోటీలో ఉన్నారు.

English summary
Fourth Phase of 2019 Lok Sabha elections polling is ongoing in 72 parliamentary constituencies across nine states. Polling started at 7am under the watchful eyes of the Election Commission of India. Over 12 crore 79 lakh voters will cast their votes to decide the fate of 961candidates at over 1 lakh 40 thousand polling booths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X