వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ మాకు కీలకం, ఎలాంటి సాయమైనా ముందుంటాం: ఇండియాకు వస్తామని ఫ్రాన్స్ మంత్రి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ప్యారిస్: చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశానికి ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. చైనా బలగాల దాడిలో అమరులైన 20 మంది భారత సైనికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్ర సంతాపం ప్రకటించింది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఓ లేఖ రాశారు.

Recommended Video

France Support to India Amid Standoff With China || Oneindia Telugu
ఎలాంటి సాయమైనా ముందుంటాం..

ఎలాంటి సాయమైనా ముందుంటాం..


ఈ లేఖలో.. భారతదేశానికి తాము అండగా ఉంటామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఫ్లోరెన్స్.. రాజ్‌నాథ్ సింగ్‌కి స్పష్టం చేశారు. తమ సాయుధ బలగాలు తరలించడంతోపాటు ఎలాంటి సాయం అవసరమైనా ముందుంటామని తెలిపారు.

భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి.. ఫ్రాన్స్

భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి.. ఫ్రాన్స్

ఈ సంక్లిష్ట సమయంలో ఫ్రాన్స్ సాయుధ దళాల తరపున తాము భారత్‌కు బాసటగా ఉంటామని తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో తమ వ్యూహాత్మక భాగస్వామి ఇండియానేనని ఫ్రాన్స్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారత్‌లో రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని తెలిపారు.

జులై చివరి నాటికి ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు

జులై చివరి నాటికి ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు

కాగా, ఫ్రాన్స్ మన దేశానికి అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తొందరగా యుద్ధ విమానాలు పంపించాలని ఫ్రాన్స్‌ను భారత్ కోరింది. ఈ నేపథ్యంలో జులై 27 నాటికి 6 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ పంపించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. దీంతో జులై చివరి నాటికి భారత పైలట్లు మన దేశానికి ఆరు రఫేల్ యుద్ధ విమానాలను తీసుకురానున్నారు. దీంతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది.

చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు

చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు

జూన్ 15న చైనా ఘర్షణలకు దిగిన నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. శాంతి చర్చలు జరుపుతామంటూనే భారీగా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం. వాస్తవాధీన రేఖ సమీపానికి భారీగా యుద్ధ ట్యాంకర్లు, ఆయుధాలను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా భారత భద్రతా దళాలను భారీ ఎత్తున మోహరిస్తోంది. ఇప్పటికే వాయుసేన సరిహద్దులో కాపలా కాస్తోంది. యుద్ధట్యాంకర్లను కూడా మోహరించింది. అంతేగాక, ఫ్రాన్స్ తోపాటు రష్యా, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలను ఆర్డర్ చేసింది.

English summary
France has expressed “deep solidarity” over the death of 20 Indian soldiers in a violent-face-off with Chinese troops along the Line of Actual Control (LAC), with French defence minister Florence Parly conveying “steadfast and friendly support” to her Indian counterpart Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X