వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత బంపరాఫర్: నెలకు 10రోజులు బస్సుల్లో ఫ్రీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడులో వృద్ధులకు మంచి ఆఫర్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు నెలకు పది రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

తద్వారా తమిళనాడులో సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. చెన్నై సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం వర్తించనుందని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. తొలివిడతగా ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుందని చెప్పారు.

Free Bus Travel for Senior Citizens in MTC Buses From February 24: Jayalalithaa

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో ఎప్పుడైనా పదిరోజుల పాటు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని, డెడ్ లైన్ లేదని జయలలిత వెల్లడించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు బస్సు డిపోలలోను, ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ ద్వారా తీసుకోవచ్చని చెప్పారు.

English summary
CM Jayalalithaa on Thursday announced that senior citizens above 60 years can travel for free in all non-A/C buses of metropolitan transport corporation in Chennai from February 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X