వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్‌ హామీ - ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీ

|
Google Oneindia TeluguNews

బీహార్‌ ఎన్నికల ప్రచారం జోరుగో సాగిపోతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మరో రెండు విడతల ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ ఇచ్చిన ఓ ఎన్నికల హామీ విమర్శలకు కేంద్రబిందువైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ... బీహార్లో దాన్ని ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీ ఇస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఉచితంగానే ఈ వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్దమవుతోంది. దీంతో బీహార్‌లో ఎన్నికల హామీ కేవలం జిమ్మిక్కేనని విపక్షాలు మండిపడుతున్నాయి.

బీహార్లో తాము అధికారంలోకి వస్తే కరోనా రోగులకు ఉచిత వ్యాక్సిన్‌ అందిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఈ హామీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిన కిందకు రాదని స్పష్టత ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రకారం చూస్తే ఇలాంటి హామీ ఇవ్వకూడదని ఎక్కడా లేదని ఈసీ తన సమాధానంలో పేర్కొంది.

Free COVID-19 vaccine promise not violation of poll code: EC

Recommended Video

Bihar Elections 2020 : 'Mahagathbandhan' Manifesto Key Highlights - Targets Farm Bills

సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే తన ఫిర్యాదులో బీహార్లో కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం కచ్చితంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివక్ష చూపడమేనని, బీహార్‌ ఎన్నికల కోసం కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ప్రజల సంక్షేమం కోసం రాజకీయ నేతలు ఎన్నికల్లో పలు హామీలు ఇవ్వడం సర్వసాధారణమేనని, ఇందులో రాజకీయమేదీ లేదని, అంతా నిబంధనలకు లోబడే జరుగుతుందని తెలిపింది.

English summary
The BJP’s promise of providing free coronavirus vaccine in its manifesto for the Bihar assembly polls is not violative of the provisions of the model code, the Election Commission has held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X