వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతిని ఉద్దేశించి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం

తాను దేశానికి చేసిన సేవ కంటే దేశం తనకు ఇచ్చిందే ఎక్కువ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన చివరి ప్రసంగంలో సోమవారం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను దేశానికి చేసిన సేవ కంటే దేశం తనకు ఇచ్చిందే ఎక్కువ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన చివరి ప్రసంగంలో సోమవారం చెప్పారు. యాభై ఏళ్ల ప్రజాజీవితంలో తనకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని, పార్లమెంటే దేవాలయం అన్నారు.

ప్రజలకు సేవ చేయడమే తన అభిమతమన్నారు. పదవీ కాలం సోమవారంతో పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రణబ్ అభినందనలు తెలిపారు.

Free public discourse from violence: Mukherjee in his last address as Prez

భవిష్యత్తులో ఆయన విజయం సాధించాలని కోరుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ఐదేళ్ల క్రితం రాష్ట్రపతిగా ప్రమాణం చేశానని చెప్పారు.

భిన్నత్వంలో కొనసాగుతున్న మన జాతి ప్రపంచానికి ఆదర్శం అన్నారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్థల ప్రగతిపై చర్చ జరగాలన్నారు.

సంక్షోభంలో ఉన్న సేద్యాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. పర్యావరణానికి నష్టం లేకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు.

English summary
In his last address to the nation before demitting office, President Pranab Mukherjee on Monday said public discourse should not be stifled and called for it to be freed from violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X