వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: రోమింగ్, ఎస్ఎంఎస్‌లు ఇక ఉచితమే, కస్టమర్లకు ఎయిర్ టెల్ బంపరాఫర్

ఎయిర్ టెల్ తన కస్టమర్లకు ఉచిత సేవలను ప్రకటించింది. ఎయిర్ టెల్ టారిఫ్ లో మార్పులు చేర్పులు చేసింది. రోమింగ్ తో పాటు ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ ఎం ఎస్ లను కూడ ఉచితంగా ఇవ్వాలని ఎయిర్ టెల్ నిర్ణయించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో తన కస్టమర్లను కాపాడుకొనేందుకుగాను ఎయిర్ టెల్ తన టారిప్ లో మార్పులు చేర్పులు చేసింది. తన కస్టమర్లను ఆకట్టుకొనేందుకుగాను ఉచిత సేవలకు ప్రకటించింది. దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడ కాల్, డేటా ఛార్జీలు లేకుండా అనుభవించవచ్చని ఎయిర్ టెల్ సోమవారం నాడు ప్రకటించింది..రోమింగ్ తో పాటు ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ ఎం ఎస్ లను కూడ ఉచితంగా ఇవ్వాలని ఎయిర్ టెల్ నిర్ణయించింది

రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇతర టెలికం కంపెనీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. ఉచిత సేవలతో రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకొంది.

అనతికాలంలోనే రిలయ్నస్ జియోకు పెద్ద ఎత్తున కస్టమర్లు మారారు.ఇతర టెలికం కంపెనీలు కూడ తీవ్రంగా నష్టపోయాయి. ఈ తరుణంలోనే టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.

రిలయన్స్ జియో మార్చి నుండి తన టారిఫ్ ను ప్రకటించింది.జియో కస్టమర్లను తన వైపుకు తిప్పుకొనేలా ఎయిర్ టెల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ఈ మేరకు టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేస్తూ సోమవారంనాడు కొత్త టారిఫ్ లను ప్రకటించింది ఎయిర్ టెల్.

ఎయిర్ టెల్ బంఫర్ ఆపర్

ఎయిర్ టెల్ బంఫర్ ఆపర్

తన కస్టమర్లకు ఎయిర్ టెల్ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కాల్, డేటా చార్జీల బెడద లేకుండానే ఎయిర్ టెల్ తన టారిఫ్ ను ప్రకటించింది.ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారిఫ్ అమల్లోకి రానుందని ఎయిర్ టెల్ ప్రకటించింది.రోమింగ్ కాల్స్ కు ప్రీమియం చార్జీలను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ టెల్ సిఈఓ గోపాల్ మిట్టల్ ప్రకటంచారు. ఏ దేశంలో అడుగుపెట్టినా ఎయిర్ టెల్ వినియోగదారులు తమ ఫోన్లను ఆన్ లో పెట్టుకోవచ్చని ఆయన చెప్పారు.తమ వినియోగదారులకు ఏ దేశంలోనైనా ఎయిర్ టెల్ నెంబర్ ను అనుమతించేలా అంతర్జాతీయ రోమింగ్ రూపంలో బారీ మార్పులు తెస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

మూడు కొత్త ప్యాకేజీలను ప్రకటించిన ఎయిర్ టెల్

మూడు కొత్త ప్యాకేజీలను ప్రకటించిన ఎయిర్ టెల్

వినియోగదారులకు కాల్ , డేటా వినియోగం కోసం ఆకర్షణీయమైన మూడు ప్యాకేజీలను ఎయిర్ టెల్ సోమవారం నాడు ప్రకటించింది. ఒకటి, ఐదు, ముప్పై రోజుల పథకాలను అందుబాటులోకి తెచ్చింది ఎయిర్ టెల్. పాపులర్ డెస్టినేషన్లలో కాల్ చార్జీలను నిమిషానికి మూడు రూపాయాలతో 90 శాతం, 3 ఎంబీ డేటాతో డేటా ఛార్జీలను 90 శాతం తగ్గించింది.

అమెరికా వెళ్ళేవారికి వన్ డే ప్యాక్

అమెరికా వెళ్ళేవారికి వన్ డే ప్యాక్

ఇండియా నుండి అమెరికా వెళ్ళే ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్ టెల్ మెరుగైన సౌకర్యాలను కల్పించింది. రూ.649 చెల్లిస్తే యూసేజ్ దాటిన తర్వాత కూడ అమెరికా వెళ్ళే భారతీయ యూజర్లు ఆటోమెటిక్ గా వన్ డే ప్యాక్ లోకి మారుతారని తద్వారా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ ఎం ఎస్ లతో పాటు 100 నిమిషాల ఇండియా, అమెరికా లోకల్ టాక్ టైం 300 ఎంబీ డేటా పొందుతారు.

ఎయిర్ టెల్ ఉచిత సేవలు

ఎయిర్ టెల్ ఉచిత సేవలు

రోమింగ్ తో పాటు ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ ఎం ఎస్ లను కూడ ఉచితంగా ఇవ్వాలని ఎయిర్ టెల్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం నాడు ఈ మేరకు ప్రకటించింది.డేటా రోమింగ్ లో ఛార్జీలు ఉండవని ప్రకటించింది..భారతీ ఎయిర్ టెల్ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. కొత్త టారిఫ్ లు అమల్లోకి వచ్చిన తర్వాత జియో నుండి ఎయిర్ టెల్ కు కస్టమర్లు మారుతారా లేదో చూడాలి.ఈ టారిఫ్ ప్లాన్ కారణంగా ఇతర టెలికం కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ కంపెనీలు కూడ టారిఫ్ ల మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

English summary
Bharti Airtel on Monday announced removal of all roaming charges for outgoing and incoming calls as well as SMSes and data usage within India as it takes on competition from new comer Reliance Jio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X