వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే పథకానికి శ్రీకారం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: మరి కొన్ని నెలల్లో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కేజ్రీవాల్ సర్కార్ అప్పుడు తాయిలం వేసింది. మహిళలను ఆకట్టుకునేందుకు కేజ్రీ సర్కార్ ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ (డీటీసీ) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రోజున ఈ పథకం ప్రారంభమైంది. భాయ్ దూజ్ పర్వదినాన ఈ పథకం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు.

ఇక ఈ పథకం వినియోగించుకునే మహిళలకు ముందుగా పింక్ టికెట్లను డీటీసీ సరఫరా చేస్తోంది. ఈ పింక్ టికెట్ల ద్వారా వారు ఢిల్లీ రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఇక ఎన్ని పింక్ టికెట్లు అయితే జారీ అయ్యాయో అంత డబ్బులను ఢిల్లీ రవాణా సంస్థకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఈ పథకంతో మహిళలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కాకుండా ఢిల్లీ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత ఇనుమడింప చేస్తుందని సిసోడియా అభిప్రాయపడ్డారు. మంగళవారం నుంచి ఈ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అవుతుందని ఢిల్లీ సర్కార్ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మహిళలకు ఉచిత ప్రయాణంకు సంబంధించిన పథకం నోయిడా-ఎన్‌సీఆర్ ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. విమానాశ్రయంతో పాటుగా డీటీసీ బస్సులు ఎక్కడెక్కడైతే ఆపరేట్ అవుతున్నాయో అక్కడంతా మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించొచ్చని కేజ్రీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Free travel scheme in DTC for women started in Delhi

స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఆగష్టు 29న జరిగిన ఢిల్లీ కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి ఆమోదం తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ మహిళా ఉద్యోగిణులు, ఈ ఉచిత పథకం వినియోగించుకున్నట్లయితే వారికి ట్రావెల్ అలవెన్సులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం.

English summary
The free of cost travel scheme for women in Delhi public buses began on Tuesday with Deputy Chief Minister Manish Sisodia saying it will ensure their safety and increase their role in the national capital's economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X