వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ అయ్యిందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది హ్యాక్ చేసింది ఎవరో దగ్గరి వారే అని, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు కూడా ఇందుకు సహకరించి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేశారు ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మరియు హ్యాకర్ ఇలియట్ ఆల్డర్సన్. ఇదే విషయాన్ని ఇలియట్ ట్వీట్ చేశారు. నరేంద్రమోడీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌కు అనధికారికంగా యాక్సెస్ ఉన్న వ్యక్తి ఒక చిన్న టెక్ట్స్‌ఫైలును సైట్ సర్వర్‌పై ఉంచాడని పేర్కొన్నారు.

ఆల్డర్సన్ అసలు పేరు రాబర్ట్ బాప్తిస్. ఈయనకు భారత్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆధార్‌ నెంబరుకు సంబంధించిన సవాళ్లను ఈయన పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అందులోని లూప్ హోల్స్‌ను పసిగట్టి ఆధార్ నెంబరుతో వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా సలహాలు సూచనలు చేశారు. అయితే తనకు ప్రధాని మోడీ అధికారిక వెబ్ సైట్‌కు అనుమతులు లేవని మరెవరో ప్రధాని వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కనుక్కోవాలని తనకు సవాలు విసిరారని ట్వీట్ ద్వారా ఇలియట్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించేందుకు ఇలియట్‌కు అనుమతులు ఉన్నాయని తాను చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

French hacker claims data on Narendra Modi website compromised

ఇలియట్ చేసిన ట్వీట్‌ను చూసిన ప్రధాని మోడీ టీమ్... వెంటనే ఇలియట్‌తో టచ్‌లోకి వెళ్లిపోయి పరిష్కారం మార్గం కోసం అతని సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న మోడీ టీమ్ తనతో టచ్‌లోకి వచ్చిందని సలహాలు సూచనలు చేశానని వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని ఇలియట్ మరో ట్వీట్ చేశారు.

English summary
A French cyber security researcher and ethical hacker on Monday morning tweeted that official website of Indian Prime Minister Narendra Modi has been compromised and that someone unauthorised already has access to full website data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X