• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబై రోడ్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడి పోస్టర్ల కలకలం: ఉగ్రవాదులకు మద్దతా? అంటూ బీజేపీ

|

ముంబై: మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే సర్కారు ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఓ కారణం కూడా ఉంది. ఎప్పుడూ జనసంచారంతో ఎంతో రద్దీగా ఉండే ముంబై రహదారులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పోస్టర్లు అతికించడం గమనార్హం.

దక్షిణ ముంబైలోని బెండీ బజార్ ప్రాంవందలాది మాక్రాన్ పోస్టర్లు అతికించినట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ అలీ రోడ్‌లోని జేజే ఫ్లై ఓవర్ కింద నీటిని అతికించగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తొలగించారు.

 French President Macron Posters On Mumbai Road Amid Extremism Row? BJP Asks Maha govt To Explain

ఫ్రాన్స్‌లోని ఓ పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై ప్రచురితమైన కార్టూన్లను సమర్థించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌పై ముస్లిం దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో మాక్రాన్ పోస్టర్లు రహదారిపై అతికించారు. మాక్రాన్ పోస్టర్లపై వాహనాలు వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రిత్రం ఫ్రాన్స్‌లో ఓ స్కూలు టీచర్ తలను నరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఒక మహిళ తలను కత్తితో నరికి ఆ పై మరో ఇద్దరిపై కత్తితో దాడి చేయడంతో వారు కూడా మృతి చెందారు. ఈ ఘటన నైస్ నగరంలోని ఓ చర్చిలో జరిగింది. ఇది ఉగ్రవాదుల చర్యే అని నైస్ నగర మేయర్ చెప్పారు. నైస్ నగరంలోని నాటర్‌డామ్ చర్చి దగ్గర దుండగుడు ముగ్గురిపై దాడి చేశాడని అతన్ని పోలీసులు పట్టుకున్నారని నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక దాడి ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొంత మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ శిరచ్చేధం చేయబడిందని పోలీసులు వివరించారు.

విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించిన టీచర్‌ తలను నరికిన ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఉగ్రదాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, ఆ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు కాల్చి చంపేశారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఘటనపై స్పందించింది. ఫ్రాన్స్‌కు భారత మద్దతు ఉంటుందని, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్‌పై వ్యక్తిగత దాడులను తాము ఖండిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇస్లామఫోబియా వ్యాఖ్యలతో టర్కీ, పాకిస్థాన్ లాంటి దేశాల నుంచి మాక్రాన్‌పై వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయి.

కాగా, ముంబైలో మాక్రాన్ పోస్టర్లను రోడ్డుపై అతికించిన ఘటనపై బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తున్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సర్కారు ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందా? అని బీజేపీ నేతలు సంబిత్ పాత్ర, శలభ్ మణి త్రిపాఠి నిలదీశారు.

English summary
Amid widespread criticism of the radical extremism that has claimed numerous lives in France and a heated debate over French President Macron formally linking it to Islam, BJP spokesperson Sambit Patra on Friday shared a viral video that shows a road plastered with posters of Macron, while vehicles zoom past over it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X