హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుర్ద్వాన్ పేలుళ్లు: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ ఖలీద్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fresh arrest in Hyderabad exposes Myanmar link with Burdwan blasts
హైదరాబాద్: బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్థు సంస్థ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉగ్రవాది ఖలీద్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఖలీద్ మయన్మార్‌కు చెందిన ఉగ్రవాది.

ఖలీద్ నకిలీ గుర్తింపు కార్డులతో హైదరాబాదులో ఉంటున్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్ టెర్రర్ క్యాంప్ నుండి అతను హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. ఐఎస్ఐఎస్‌తో ఖలీద్‌కు సంబంధాలు ఉన్నాయి. బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఉగ్రవాది కీలక నిందితుడు.

అతనిని హైదరాబాదులో అరెస్టు చేసిన పోలీసులు.. అతని నుండి ఐఈడీ బాంబుల తయారీ మెటీరియల్‌ను, పలు వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుర్ద్వాన్ పేలుళ్ల తర్వాత అతను హైదరాబాద్ మకాం మార్చినట్లుగా తెలుస్తోంది. అతనికి బంగ్లా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బాంబులు పేలాయి.

English summary
A crucial arrest was made by the National Investigation Agency (NIA) in connection to the October 2 Burdhwan blasts on Tuesday. The arrested person is named Khalid Mohammad and is 28 year-old. He is a resident of Myanmar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X