చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమాల్లో చాన్స్: తమిళ పవర్ స్టార్ మీద మరో చీటింగ్ కేసు, లెక్కలేనన్ని మోసం కేసులు !

తమిళ పవర్ స్టార్ మీద మరో చీటింగ్ కేసు నమోదుసినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని యువకుడిని మోసం చేశాడుఢిల్లీలో రూ. 10 కోట్ల చీటింగ్ కేసు, చెన్నైలో అనేక పోలీస్ స్టేషన్లలో ఇవే కేసులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సినీరంగంలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనివాసన్ మీద మరో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. చెన్నైలోని అన్నానగర్ కు చెందిన పవర్ స్టార్ శ్రీనివాసన్ మీద కేసు నమోదు చేసిన చెన్నైలోని వాషరర్ పేట పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

శ్రీనివాసన్ స్వతహాగా వైద్యుడు.. తమిళ సినీమాల్లో నటిస్తూ తనకు తానుగానే పవర్ స్టార్ అని పేరు పెట్టుకుని గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యాడు. ఇతను పవర్ స్టార్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో మోసం కేసుల్లో అంత కంటే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళనాడుతో పాటు ఢిల్లీలో శ్రీనివాసన్ మీద అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి.

Fresh cheating complaint against Tamil Nadu Power Star Srinivasan

తాజాగా పుదువణైయార్ పేటకు చెందిన దయానిధి (32) అనే యువకుడు శ్రీనివాసన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని శ్రీనివాసన్ 2015 సెప్టెంబర్ లో రూ. 4.15 లక్షలు తీసుకున్నాడని, ఇంత వరకూ ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇప్పించలేదని దయానిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని మనవి చేస్తే ఎవరు నువ్వు, నాకెందుకు డబ్బులు ఇచ్చావు అని పవర్ స్టార్ ప్రశ్నిస్తున్నాడని బాధితుడు దయానిధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దిలీప్ బద్లానికి రూ. 100 కోట్లు రుణం ఇప్పిస్తానని శ్రీనివాసన్ నమ్మించాడు.

దిలీప్ బద్లానికి రూ. 100 కోట్లు రుణం ఇప్పించడానికి రూ. 10 కోట్లు కమిషన్ తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు శ్రీనివాసన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన శ్రీనివాసన్ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నాడు. చెన్నైలోని అన్నానగర్, కీలపాక్కం, క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి.

English summary
amil cinema's self-proclaimed Power Star Srinivasan has landed in trouble once again, as a complaint was filed against him with the New Washermenpet police station in the city. According to Dayanidhi of Indira Gandhi Nagar in New Washermenpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X