వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ పుష్ప... ఆ వివాదాస్పద తీర్పుల జడ్జి పదవీకాలం మరో ఏడాది పొడగింపు...

|
Google Oneindia TeluguNews

లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో ఇటీవల వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి పుష్ప గనెదివాలా పదవీకాలాన్ని కేంద్ర న్యాయశాఖ మరోసారి పొడగించింది. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కానీ ఇటీవలి వివాదాస్పద తీర్పుల నేపథ్యంలో కేంద్రం ఆమె పదవి కాలాన్ని ఒక ఏడాది మాత్రమే పొడగించింది.

దుస్తుల పైనుంచి స్తనాలను నొక్కడం లైంగిక దాడి కాదా..? బాంబే హైకోర్టు సంచలన తీర్పు...దుస్తుల పైనుంచి స్తనాలను నొక్కడం లైంగిక దాడి కాదా..? బాంబే హైకోర్టు సంచలన తీర్పు...

అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ పుష్ప శుక్రవారంతో తన రెండేళ్ల పదవీ కాలన్ని పూర్తి చేసుకున్నారు. నిజానికి అదనపు న్యాయమూర్తి పదవి తర్వాత శాశ్వత న్యాయమూర్తి హోదా రావాల్సి ఉంటుంది. పుష్ప గనెదివాలా అదనపు న్యాయమూర్తి పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో.. ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదా కోసం గతంలోనే సుప్రీం కోర్టు కొలీజయంకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే వివాదాస్పద తీర్పుల కారణంగా గత నెల 20న ఆ ప్రతిపాదనలను సుప్రీం కోర్టు కొలిజీయం పక్కన పెట్టేసింది.

 Fresh Term Of Bombay hc judge pushpa Who Delivered Controversial Verdicts Reduced To 1 Year

అదనపు న్యాయమూర్తి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సుప్రీం కొలిజీయంను కోరడం బదులు... కేంద్ర న్యాయశాఖనే ఆమెకు మరో ఏడాది పాటు పదవి కాలాన్ని పొడగించడం గమనార్హం.

కాగా,గత నెలలో 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో న్యాయమూర్తి పుష్ప వివాదాస్పద తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం... బాలిక స్తనాలను దుస్తుల పైనుంచి తాకడాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఇద్దరి మధ్య స్కిన్-టు-స్కిన్(చర్మాన్ని చర్మం తాకడం) కాంటాక్ట్ జరిగినప్పుడు మాత్రమే లైంగిక దాడిగా పరిగణిస్తామని స్పష్ట చేసింది. పోక్సో చట్టం కింద నిందితుడిపై నమోదైన అభియోగాలను కొట్టివేసి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.

బాలిక చేయిని పట్టుకుని... ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి.. దాన్ని నేరంగా పరిగణించలేమన్న బాంబే హైకోర్టు..బాలిక చేయిని పట్టుకుని... ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి.. దాన్ని నేరంగా పరిగణించలేమన్న బాంబే హైకోర్టు..

గత నెలలోనూ మరో వివాదాస్పద తీర్పును వెలువరించారు జస్టిస్ పుష్ప. మరో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో... బాలిక చేతిని పట్టుకుని,అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రానా పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని పుష్ప పేర్కొన్నారు.ఐపీసీ సెక్షన్ 354-A(1) ప్రకారం అది లైంగిక వేధింపుల కిందకు వస్తుంది తప్ప.. పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కిందకు రాదని స్పష్టం చేశారు. జస్టిస్ పుష్ప ఇచ్చిన ఈ రెండు తీర్పులు వివాదాస్పదంగా మారి తీవ్ర చర్చకు దారితీశాయి.

English summary
A Bombay High Court additional judge, who had delivered two controversial verdicts in sexual assault cases, was on Friday given a fresh one-year term as an additional judge, instead of two years as recommended by the Supreme Court collegium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X