వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రగిలిన బెంగాల్ : భాత్పూరలో బాంబులేసిన దుండగులు, పరిస్థితి ఉద్రిక్తం

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : బెంగాల్‌లో మళ్లీ హింస రాజుకుంది. ఉత్తర 24 పరగణ జిల్లాలో మరోసారి ఘర్షణ జరిగింది భాత్పూరా కనినార ప్రాంతంలో కొందరు బాంబులు వేయడంతో వివాదం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెలరేగిన ఘర్షణలో పదుల సంఖ్యలో కార్యకర్తలు కూడా చనిపోయారు.

 Fresh violence in Bengals Bhatpara-Kankinara

రగిలిన బెంగాల్
ఇవాళ భాత్పూరలో కొందరు బాంబులను పేల్చారు. ఈ ప్రాంతంలో శనివారం నుంచి బాంబులతో కొందరు తచ్చాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారించి .. ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రైల్వే హౌసింగ్ కాంప్లెక్సులో కూడా మరో బాంబు లభించింది. మరోవైపు భాత్పూర మత్రి సదన్ (మెటర్నిటీ ఆస్పత్రి)పై బాంబులు విసిరారు. దీంతో కొందరు రోగులు భయాందోళనకు గురయ్యారు. దీంతోపాటు కన్కికరలోని వివిధ ప్రాంతాల్లో కూడా బాంబులు వేసినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు స్థానికులు కన్నికరలో రైల్వేలను అడ్డుకున్నారు. హింసను వ్యతిరేకిస్తూ సీల్వా రాణాఘాట్ డివిజన్ మధ్యలో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.

కొందరు దుండగులు సోమవారం మూడు ప్రాంతాల్లో బాంబులు విసిరినట్టు గుర్తించామని డిప్యూటి కమిషనర్ అజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దింపామని వివరించారు. భద్రతా చర్యల దృష్ట్యా షాపులు, మార్కెట్, ఇతర సముదాయాలను మూసివేసినట్టు పేర్కొన్నారు. దీంతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా పెట్రోలింగ్ చేస్తున్నట్టు వివరించారు.

English summary
Troubled Bhatpara-Kankinara region in West Bengal's North 24 Parganas district witnessed fresh violence on Monday when some bombs exploded in the area, police said. There were reports of sporadic explosion of bombs in the area since Saturday evening, they said, adding two persons have been arrested in connection with it. Fifty crude bombs were recovered by the police Monday morning from an abandoned railway housing complex in the area, which had witnessed repeated clashes between the ruling Trinamool Congress (TMC) and Bhartiya Janata Party (BJP) since the Lok Sabha election results in May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X