• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆహా ఏమి రుచి..అనరా మైమరచి: మనకు విషం వారికి అమృతం...ఇంతకీ ఆ వంట ఏమిటబ్బా..?

|

అక్కడ ఆదివారం వస్తే చాలు... ఓ హాట్ స్పైసీ వంటకం రెడీగా ఉంటుంది. ఆదివారం అంటున్నారు...అంత స్పైసీ హాట్ ఫుడ్ ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటున్నారా... ఆ... ఏముందిలే... ఏ చికెనో, మటనో ఉంటుందనకుంటే మీరు పప్పులో కాలేసినట్లే... అక్కడ చికెన్ మటన్ కాకుండా మరో స్పెషల్ ఫుడ్ అక్కడి స్థానికులను నోరూరిస్తుంది. వారు కూడా అంతే సరదాగా లొట్టలేసుకుని తింటారు. ఇంతకీ ఈ వంటకం ఏంటి... ఇది ఎక్కడ దొరుకుతుందనేగా... అక్కడికే వస్తున్నాం.

సండే స్పెషల్ ఎలుక ఫ్రై

సండే స్పెషల్ ఎలుక ఫ్రై

అస్సోం... ఈశాన్య రాష్ట్రాల్లో ఓ ముఖ్య రాష్ట్రం. అక్కడ ఏదైనా సెలవు వస్తే చాలు... అక్కడ కుమరికత అనే గ్రామంలో ఓ మార్కెట్‌ అంతా ఎలుకలతోనే కనిపిస్తుంది. అది కూడా అట్లాంటి
ఇట్లాంటి ఎలుకలు కాదండోయ్... చాలా తాజా తాజా ఎలుకలు. అప్పుడే వాటిని పట్టుకుని నీళ్లల్లో ఉడికించి ఆతర్వాత చర్మం తీసి, ఓ స్పైసీ గ్రేవీలో వండుతారు. ఇదంతా మనకు చదువుతుంటేనే కడుపులో దేవేస్తున్నట్లుంది కదూ.... కానీ అక్కడి స్థానికులు మాత్రం ఆవురావురుమంటూ లొట్టలేసుకుని తినేస్తారు.

 స్కిన్‌లెస్ ర్యాట్ ధర కిలో.రూ.200

స్కిన్‌లెస్ ర్యాట్ ధర కిలో.రూ.200


మొత్తానికి అక్కడి స్థానికులు ఈ స్కిన్‌లెస్ ఎలుకలను కొని తెగ ఎంజాయ్ చేస్తారు. ఇవి ఎంతలా పాపులర్ అయ్యాయంటే చికెన్, మటన్, పోర్క్‌కంటే పాపులర్ అయ్యాయి. కొన్ని వందల సంఖ్యలో ఈ తాజా ఎలుకలను అక్కడి ప్రజలు తీసుకెళతారు. భూటాన్ దేశ సరిహద్దులోని పొలాల్లో ఈ ఎలుకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వీటిని రైతులు పట్టుకుని రోస్ట్ చేసిన ఈ స్పైసీ వంటను బజారులో పెట్టి విక్రయిస్తారు. ఈ మూషికాలే అక్కడి ఆదివాసీలకు ప్రధాన ఆదాయం తెచ్చి పెడుతుంది. శీతాకాలంలో టీఆకు పనులు లేనప్పుడు ఆదివాసీలు వరిపొలాల్లోకి వెళ్లి ఎలుకలను వేటాడి మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇంతకీ కిలో ఎలుక ధర ఎంతో తెలుసా... చికెన్‌ పోర్క్‌లతో సమానంగా రూ.200 ఉంటుంది.

రాత్రివేళల్లో ప్రత్యేక వల పన్ని ఎలుకలను పట్టుకుంటారు

రాత్రివేళల్లో ప్రత్యేక వల పన్ని ఎలుకలను పట్టుకుంటారు

గత కొన్నేళ్లుగా వరిపొలాల్లో ఎలుకలు ఎక్కువయ్యాయి. ఎలుకలు పట్టేందుకు గాను కొన్ని ప్రత్యేక వలలు పొలాల్లో వేసి ఉంచినట్లు రైతు సోరెన్ తెలిపాడు. ఈ ఎలుకలను రాత్రి వేళల్లో పట్టుకుంటామని చెప్పిన సోరెన్... సాయంత్రం వేళల్లో ఎలుక రంద్రాల దగ్గర వలలు ఉంచుతామని రాత్రి వేళల్లో అవి బయటకు వచ్చిన సమయంలో వలలో చిక్కుకుంటాయని చెప్పాడు. అంతేకాదు రాత్రంతా ఈ ఎలుకల కోసం మేల్కొని ఉంటామని చెప్పిన సోరెన్... ఒకవేళ ఆదమరిస్తే ఆ ఎలుకలను ఇతర జంతువులు ఎత్తుకుపోయే ప్రమాదం ఉందని చెప్పాడు. చాలా ఎలుకలు ఒక కిలోకంటే ఎక్కువ బరువు ఉంటాయని చెప్పాడు.

English summary
Freshly-caught rat is at the top of the holiday menu for crowds flocking to a market in northeastern India that specialises in rodents from local fields.Destined to be boiled, skinned and then cooked in a spicy gravy, rat is more popular than chicken and pork with customers at the Sunday market in the village of Kumarikata in Assam state.అరుణాచల్ ప్రదేశ్‌...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X