Friend wife: బాత్ రూమ్ లో స్పై కెమెరా, లైవ్ లో వీడియోలు చూసి, చీపుర్లు తిరగేసిన లేడీస్ !
చెన్నై/ కోయంబత్తూర్: భార్య, కూతుర్లను ఎంత కాపాడుకోవాలని ఇంటి యజమానులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు కామాంధులు సందెట్లో పడేమియా అంటూ చేసేపని చేసేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీ ఉపయోగిస్తున్న నిందితులు బాత్ రూమ్ లు, బెడ్ రూమ్ లతో పాటు ఎక్కడ పడితే అక్కడ స్పై కెమెరాలు, హిడెన్ కెమెరాలు దాచిపెడుతున్నారు. ఒకే వీదిలో నివాసం ఉంటున్న వ్యక్తిని ఇంట్లో చిన్న పటి ఉంటే స్నేహితుడు పిలిపించాడు. స్నేహితుడి భార్య మీద చాలా కాలం నుంచి కన్ను వేసిన కామాంధుడు ఇదే మంచి చాన్స్ అంటూ ఎగేసుకుంటూ వెళ్లిపోయాడు. స్నేహితుడి ఇంటి బాత్ రూమ్ లోకి వెళ్లిపోయిన కామాంధుడు అక్కడ సీక్రేట్ గా స్పై కెమెరా ఫిట్ చేసి వెళ్లిపోయాడు.
తరువాత స్పై కెమెరాలో అక్కడ ఫ్రెండ్ భార్య స్నానం చేస్తున్న సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో లైవ్ లో వీడియోలు చూస్తున్నాడు. నాలుగు రోజుల తరువాత బ్యాట్రీ డౌన్ కావడంతో స్పై కెమెరా నుంచి రెడ్ లైట్ వెలుగడం మొదలు పెట్టింది. స్నానం చేస్తున్న మహిళకు బాత్ రూమ్ పైన రెడ్ లైట్ వెలుగుతున్న విషయం కనపడింది. వెంటనే భర్తకు సమాచారం ఇవ్వడంతో కథ మలుపు తిరిగింది. నాలుగు రోజుల క్రితం తన స్నేహితుడిని ఇంటి బాత్ రూమ్ లోకి పిలిచాడని, అతనే అక్కడ స్పైకెమెరా ఎర్పాటు చేసి ఉంటాడని గుర్తించారు. ఫ్రెండ్ భార్యతో పాటు ఆ ఏరియాలోని మహిళలు చీపుర్లు తిరగేసి కొట్టడం, వారి భర్తలు కలిసి కామాంధుడిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తియ్యగా అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
Illegal
affair:
లవ్
మ్యారేజ్,
మొబైల్
షోరూమ్
లో
బెడ్
రూమ్,
లేడీ
పోలీసుతో
రొమాన్స్,
ఖర్మకాలి!

ఫ్రెండ్ ఫ్యామిలీ
తమిళనాడులోని కోయంబత్తూరులోని రామనాథపురంలో అమ్మాన్ కులం వీధిలో రాజ్ కుమార్ అనే వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యతో పాటు కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి ఇంటిని అన్ని రకాలుగా సేఫ్టీగా పెట్టిన రాజ్ కుమార్ అతని పని అతను చేసుకుంటున్నాడు. ఇదే ఏరియాలో రాజ్ కుమార్ స్నేహితుడు మురుగన్ నివాసం ఉంటున్నాడు.

ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది
రాజ్ కుమార్, మురుగన్ ఒకే ఏరియాలో ఉండటంతో ఇద్దరు స్నేహితులు అయ్యారు. రాజ్ కుమార్ భార్యను చూసి సొల్లు కార్చుకుంటున్న మరుగన్ ఆమెను లొంగదీసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. అయితే రాజ్ కుమార్ భార్య మాత్రం మురుగన్ కు లొంగలేదని తెసింది. మురుగన్ కు ఇప్పటికే వివాహం అయ్యి 20 సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఉన్నాడు.

ఫ్లమ్మింగ్ కాంట్రాక్టర్
మురుగన్ ఎలక్ట్రీషియన్, ఫ్లమ్మింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడని సమాచారం. బాత్ రూమ్ లో వాటర్ సక్రమంగా రాకపోవడంతో వాటిని సరిచెయ్యాలని, ఎవరినైనా పంపించాలని రాజ్ కుమార్ అతని స్నేహితుడు మురుగన్ కు చెప్పాడు. ఎవరో ఎందుకు ఏమైయ్యింది అనే విషయం తానే చూస్తానని మురుగన్ ఎగేసుకుంటూ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లాడు.

బాత్ రూమ్ లో స్పై కెమెరా ఫిట్ చేశాడు
స్నేహితుడు రాజ్ కుమార్ ఇంటి బాత్ రూమ్ లో వెళ్లిపోయిన కామాంధుడు మురుగన్ అక్కడ పైప్ లైన్ పరిశీలిస్తున్నట్లు నటించి అక్కడ సీక్రేట్ గా స్పై కెమెరా ఫిట్ చేశాడు. తరువాత అంతా సరిచేశానని చెప్పిన మురుగన్ కొంత సేపటి తరువాత రాజ్ కుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి రాజ్ కుమార్ భార్య బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో, ఆమె అక్కడ ఏకాంతంగా ఉన్న సమయంలో స్పై కెమెరా నుంచి లైవ్ లో వీడియోలు చూస్తున్న మురుగన్ సొల్లు కార్చుకుంటూ మూడు రోజులు ఎంజాయ్ చేశాడని సమాచారం

రెడ్ లైట్ తో భార్యకు అనుమానం
నాలుగు రోజుల తరువాత బాత్ రూమ్ లో ఫిట్ చేసిన స్పై కెమెరా బ్యాట్రీ డౌన్ కావడంతో స్పై కెమెరా నుంచి రెడ్ లైట్ వెలుగడం మొదలు పెట్టింది. స్నానం చేస్తున్న రాజ్ కుమార్ భార్య బాత్ రూమ్ పైన రెడ్ లైట్ వెలుగుతున్న విషయం గుర్తించింది. వెంటనే భర్త రాజ్ కుమార్ కు సమాచారం ఇచ్చింది. వెంటనే పైన పైపుల దగ్గర ఏర్పాటు చేసిన స్పై కెమెరాను బయటకు తీశారు. మన బాత్ రూమ్ లోకి ఎవరు వచ్చి స్పై కెమెరా ఫిట్ చేశారు అని రాజ్ కుమార్ ఆలోచించాడు.

కిలాడీ నాకొడుకు పనేనా ?
తన బాత్ రూమ్ లోకి నాలుగు రోజుల క్రితం మురుగన్ వచ్చి వెళ్లాడని తెలుసుకున్న రాజ్ కుమార్ అతని కోసం వెతికాడు. రాత్రి ఫుల్ గా మద్యం సేవించి మురుగన్ ఆ ఏరియాలోకి వెళ్లాడు. ఆ సమయంలో రాజ్ కుమార్ తో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న సంజయ్, అజిత్, సురేష్ తదితరులు, రాజ్ కుమార్ భార్యతో పాటు స్థానిక మహిళలు కలిసి మురుగన్ ను పట్టుకున్నారు.

పరకలు తిరగేసి చెప్పులు తెగిపోయేలా దాడి
మొదట నేను స్పై కెమెరా ఫిట్ చెయ్యలేదని మురుగన్ ఎదురు తిరిగాడు. రాజ్ కుమార్ భార్యతో పాటు స్థానిక మహిళలు, రాజ్ కుమార్, అతని స్నేహితులు కలిసి మురుగన్ మీద దాడి చేశారు. మహిళలు పరకలు వి

ఇరు వర్గాల మీద కేసులు
విషయం తెలుసుకున్న కోయంబత్తూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్రెండ్ బాత్ రూమ్ లో స్పై కెమెరా ఫిట్ చేసిన మురుగన్ ను అరెస్టు చేసి అతని మీద కేసు నమోదు చేశారు. మురుగన్ ఫిర్యాదు మేరకు అతని మీద దాడి చేసిన రాజ్ కుమార్, అజిత్, సంజయ్, సురేష్ తదితరుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఇంటిలో మహిళలు సేఫ్ గా ఉండాలని ఇంటి యజమాని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి వాళ్లు బాత్ రూమ్ లు, బెడ్ రూమ్ ల్లో స్పై కెమెరాలు ఫిట్ చేసి వెళ్లిపోవడంతో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపణలు ఉన్నాయి.