Friends: మాజీ రౌడీషీటర్, మాట్లాడాలని చెప్పి ?, కాళ్లు పూర్తిగా నరికేసి రైలు పట్టాల మీద శవం, మ్యాటర్ !

చెన్నై: వయసుకు వచ్చిన యువకుడు పనిపాట చెయ్యకుండా స్నేహితులతో కలిసి జులాయిగా తిరిగాడు. సిటీలో నివాసం ఉంటున్న ఆ యువకుడు అతను నివాసం ఉంటున్న ఏరియలో రౌడీగా ముద్రవేసుకున్నాడు. స్నేహితులతో కలిసి రౌడీయిజం చెయ్యడం, సెటిల్ మెంట్లు చెయ్యడం చేస్తున్నాడు. ఇప్పటికే యువకుడి మీద అనేక కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వస్తున్న యువకుడికి నీ పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో అతను బుద్దిగా ఉండాలని అనుకున్నాడు. ఇక ముందు ఎలాంటి నేరాలు చెయ్యనని పోలీస్ స్టేషల్ లో లెటర్ రాసి సంతకం చేసిన ఆ యువకుడు బుద్దిగా ఉంటున్నాడు. నాలుగు నెలల నుంచి అతని మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు. రాత్రి ఇంట్లో ఉన్న మాజీ రౌడీషీటర్ అతని స్నేహితులు కొందరు బయటకు పిలుచుకుని వెళ్లారు. తరువాత ఆ యువకుడి ఆచూకిలేదు. ఆ యువకుడి శవం రైలు పట్టాల మీద దర్శనం ఇచ్చింది. యువకుడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి. యువకుడిని హత్య చేసిన నిందితులు దానిని రైలు ప్రమాదంగా చిత్రీకరించడానికి శవాన్ని రైలు పట్టాల మీద విసిరేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

 రౌడీషీటర్

రౌడీషీటర్

చెన్నై సిటీలోని తిరువొట్టియూర్ లోని కార్గిల్ నగర్ లో శీను అలియాస్ శీనా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వయసుకు వచ్చిన శీను పనిపాట చెయ్యకుండా స్నేహితులతో కలిసి జులాయిగా తిరిగాడు. చెన్నై సిటీలో నివాసం ఉంటున్న శీను అతను నివాసం ఉంటున్న తిరువొత్తూరు ఏరియలో రౌడీగా ముద్రవేసుకున్నాడు.

 ఇప్పటికే అనేక కేసులు

ఇప్పటికే అనేక కేసులు

శీను అతని స్నేహితులతో కలిసి రౌడీయిజం చెయ్యడం, సెటిల్ మెంట్లు చెయ్యడం చేస్తున్నాడు. ఇప్పటికే శీను మీద చెన్నైలో అనేక కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వస్తున్న శీనురి నీ పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెన్నై సిటీ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 నేరాలు చెయ్యనని లెటర్ రాసి ఇచ్చాడు

నేరాలు చెయ్యనని లెటర్ రాసి ఇచ్చాడు

పోలీసులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో శీను బుద్దిగా ఉండాలని అనుకున్నాడు. ఇక ముందు ఎలాంటి నేరాలు చెయ్యనని పోలీస్ స్టేషల్ లో లెటర్ రాసి సంతకం చేసిన శీను కొంతకాలంగా బుద్దిగా ఉంటున్నాడు. నాలుగు నెలల నుంచి శీను మీద ఎలాంటి ఆరోపణలు రాకపోవడంతో అతను మారిపోతున్నాడని అందరూ అనుకున్నారు.

 కాళ్లు నరికేసి రైలు పట్టాల మీద శవం విసిరేసి ?

కాళ్లు నరికేసి రైలు పట్టాల మీద శవం విసిరేసి ?

రాత్రి ఇంట్లో ఉన్న శీనును అతని స్నేహితులు కార్తీ, లోకేష్ తో పాటు కొందరు బయటకు పిలుచుకుని వెళ్లారు. తరువాత శీను ఆచూకిలేదు. రాత్రి కుటుంబ సభ్యులు గాలించినా అతను మాత్రం వాళ్లకు చిక్కలేదు. అయితే ఇంటి నుంచి వెళ్లిన శీను తిరువొత్తూరు సమీపంలోని అన్నానగర్ ఏరియాలో రైలు పట్టాల మీద శవమై కనిపించాడు.

 ఎవరు చంపేశారు ?

ఎవరు చంపేశారు ?

శీను రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి. శీనును హత్య చేసిన నిందితులు అతని శవాన్ని రైలు పట్టాల మీద విసిరేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి రైలు పట్టాల మీద విసిరేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. శీను అతని స్నేహితులు హత్య చేశారా ?, ఇంకా ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో విచారణ చేస్తన్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+