వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Friendship Day 2020 : చాలామందిలో ఒక కన్ఫ్యూజన్... అసలేంటి దీని నేపథ్యం?

|
Google Oneindia TeluguNews

ఫ్రెండ్ షిప్ డే విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అసలు స్నేహితుల రోజు జూలై 30వ తేదీనా లేక అగస్టు మొదటి ఆదివారమా..? అని. నిజానికి ఈ రెండూ 'ఫ్రెండ్ షిప్ డే' గానే పరిగణించబడుతున్నాయి. అయితే ఇందులో ఒకటి ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే కాగా.. మరొకటి నేషనల్ ఫ్రెండ్‌షిప్‌ డే.

27 ఏప్రిల్,2011న ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే తేదీని జూలై 30గా గుర్తించింది. అయినప్పటికీ చాలా దేశాల్లో అగస్టు మొదటి ఆదివారం నేషనల్ ఫ్రెండ్‌షిప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నిజానికి ఈ ఫ్రెండ్‌షిప్ డే ఆలోచన వెనుక ఒక మార్కెట్ స్ట్రాటజీ కూడా ఉందన్న ప్రచారం ఉంది.

friendship day 2020 Whats the history behind the origin of Friendship Day

1930లో జోయ్స్ హాల్ అనే వ్యక్తి హాల్ మార్క్ కార్డుల అమ్మకాల కోసం ఫ్రెండ్‌షిప్‌ డే అనే దాన్ని పుట్టించినట్లుగా చెబుతారు. ఆరోజు సన్నిహితులు,ఆత్మీయులకు గ్రీటింగ్ కార్డుల ద్వారా విషెస్ చెప్పాలన్న ఆలోచనను పుట్టించాడని.. తద్వారా వాటి అమ్మకం పెంచుకోవడానికి దీన్నో మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడుకున్నాడని చెప్తారు. ఆ తర్వాతి రోజుల్లో అమెరికా కాంగ్రెస్ సైతం అగస్టు మొదటి ఆదివారాన్ని అధికారికంగా నేషనల్ ఫ్రెండ్‌షిప్‌ డేగా గుర్తించి ఆరోజు హాలీ డేగా ప్రకటించడం విశేషం.

కొన్నేళ్ల క్రితం వరకూ ఫ్రెండ్‌షిప్ డే అనగానే గ్రీటింగ్ కార్డుల సందడి కనిపించేది. కానీ స్మార్ట్ ఫోన్స్,ఇంటర్నెట్,సోషల్ మీడియా రాకతో అంతా మారిపోయింది. వాట్సాప్,ఫేస్‌బుక్,ట్విట్టర్,షేర్ చాట్ ఇలా రకరకాల మాధ్యమాల్లో ఇప్పుడు స్నేహితులను విష్ చేస్తున్నారు. ఆకర్షించే కోట్స్‌తో పోస్టులు పెడుతున్నారు.

Recommended Video

Friendship Day 2020 : జీవితం లో Friends యొక్క పాత్ర ఎలా ఉండాలంటే..!!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో స్నేహితులంతా కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇంట్లోనే ఉండి స్నేహితులను ఫోన్‌లో పలకరించి సంతృప్తి పడటమే.

English summary
Every year on the first Sunday of August, National Friendship Day is celebrated in India. This year it will be celebrated on August 2, 2020. It celebrates the importance of platonic relationships and how it shapes us as people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X